టాలీవుడ్‌పై , స్టార్లపై జగన్ సర్కార్ మార్క్ షాకులు కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటికే టిక్కెట్ రేట్లు తగ్గించడంతో మొదలు పెడితే సెకండ్ షోలకు పర్మిషన్లు ఇవ్వకపోవడం, కరోనా నేపథ్యంలో విద్యుత్ చార్జీలు తగ్గిస్తామని చెప్పినా దాని ఊసే లేకపోవడం ఇలా ఎన్నో షాకులు ఏపీలో సినిమా వాళ్లకు తగులుతున్నాయి. ఇండస్ట్రీ స్టార్లు ఈ విషయంలో జగన్‌ను ఎంత కన్విన్స్ చేయాలని చూస్తున్నా జగన్ వారిని ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. చిరంజీవి ఇప్పటికే సతీ సమేతంగా అమరావతి వెళ్లి జగన్‌ను కలిసి పైగా ఆయన ఇంట్లో భోజనం కూడా చేసి వచ్చారు. ఆ తర్వాత నాగార్జు, చిరంజీవి, సురేష్‌బాబు లాంటి వాళ్లు సైతం జగన్‌ను కలిశారు. అయినా జగన్ మాత్రం ఇండస్ట్రీ వాళ్ల వినతులను ఏ మాత్రం లెక్కలోకి తీసుకున్నట్టు కనపడడం లేదు.
ఇక ఇప్పుడు ఇండస్ట్రీకి, స్టార్లకు నెక్ట్స్ షాక్ ఇచ్చేందుకు జగన్ సర్కార్ రెడీ అవుతోన్న పరిస్థితి ఉంది. ఏపీలో స్టూడియోలు నిర్మించుకోవాలన్న కోరికతో బడా బడా ప్రొడ్యుసర్లు, స్టార్ హీరోలు ఇప్పటికే ఏపీ ప్రభుత్వానికి 25 కు పైగా దరఖాస్తులు పెట్టుకున్నారు. ఒక్కొక్కరికి ఫ్రీగా 20 నుంచి 30 ఎకరాలు అయినా వస్తాయని ఆశలు పెట్టుకున్నారు. వీళ్లు స్టూడియోలు కట్టుకునేందుకు ఎక్కడ భూమి ఇవ్వాలో కూడా ప్రభుత్వం ఇప్పటికే డిసైడ్ చేసిందన్న ప్రచారం కూడా జరిగింది. లేటెస్ట్ అప్‌డేట్ ఏంటంటే ఈ దరఖాస్తులు అన్ని ప్రభుత్వం పక్కన పడేసిందట.
సినిమా వాళ్లకు అస్సలు భూములు ఇవ్వకూడదన్నది ఓ కండీషన్ అయితే… ఏదైనా అవసరం కోసం ఇస్తే అందుకు రేటు కట్టే ఇవ్వాలని నిర్ణయం తీసుకుందట. ఓ వైపు ప్రజల ఇళ్లకు, ప్రభుత్వ కార్యాలయాలకే భూములు దొరకనప్పుడు ఇక సినిమా వాళ్లకు వందల ఎకరాలు ఎక్కడ నుంచి తెచ్చి ఇవ్వాలన్నది ప్రభుత్వం తరపున ప్రశ్నగా తెలుస్తోంది. ఇప్పటి వరకు జగన్ టిక్కెట్ రేట్లు తగ్గించినా, సెకండ్ షోలకు ఇంకా పర్మిషన్లు ఇవ్వకపోయినా ఎవ్వరూ కిమ్మనలేదు. ప్రభుత్వం నుంచి స్టూడియోలకు భారీగా భూములు ఉచితంగా వస్తాయని ఆశలు పెట్టుకున్నారు. అయితే ఇప్పుడు ఈ విషయం తెలిసే సరికి వారు కక్కలేక మింగలేక చందంగా ఉన్నారు.