ఏపీలో టిక్కెట్ రేట్ల పెంపు వ్యవహారంతో పాటు సెకండ్ షో వ్యవహారం ఎప్పటకి కొలిక్కి వస్తుందో ? అర్థం కావడం లేదు. ఓ వైపు తెలంగాణలో థియేటర్లు పూర్తిస్థాయిలో ప్రారంభమై నెల రోజులు దాటింది. అక్కడ టిక్కెట్ రేట్లతో వచ్చిన ఇబ్బంది లేదు. అయితే ఏపీలో వ్యవహారం వేరుగా ఉంది. వకీల్‌సాబ్ సినిమా టైంలో జగన్ ప్రభుత్వం తీసుకు వచ్చిన జీవో వల్ల టిక్కెట్ రేట్లు బాగా తగ్గిపోయాయి. 1990వ దశకంలో ఏ రేట్లు ఉన్నాయో ఇప్పుడు కూడా అదే రేట్లు ఉన్నాయి. మరీ ముఖ్యంగా బీ, సీ సెంటర్లలో టిక్కెట్ రేట్లు చూస్తే సినిమా వాళ్లకు కన్నీళ్లే వస్తున్నాయి.
ఇప్పటి వరకు కోట్లలో రెమ్యునరేషన్లు తీసుకుని ఇష్టారాజ్యంగా ప్రేక్షకుడిని దోచుకుంటోన్న సినిమా వాళ్లకు జగన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం గొంతులో పచ్చి వెలక్కాయ పడేలా చేసింది. ఇప్పటికే చిరంజీవి లాంటి వాళ్లు జగన్‌ను కలిశారు. అయినా ఉపయోగం లేదు. అయితే ఇప్పుడు ఏపీలో పెద్ద హీరోల సినిమాల వసూళ్లపై పెద్ద ఎదురు దెబ్బ తగలనుంది. ఈ టిక్కెట్ రేట్లతో సినిమాలు రిలీజ్ చేసినా ఉపయోగం ఉండదనే చాలా మంది నిర్మాతలు తమ సినిమాలు రిలీజ్ చేసేందుకు కూడా ఒప్పుకోవడం లేదు.
ఇక ఈ నెల 4వ తేదీన టాలీవుడ్ ప్రముఖులు జగన్‌ను మీట్ అయ్యేందుకు అపాయింట్‌మెంట్ వచ్చిందంటున్నారు. ఏపీ మంత్రి పేర్ని నాని ఆధ్వర్యంలో ఈ అపాయింట్‌మెంట్ దక్కించుకున్నారట. అయితే ఇక్కడే ఓ ట్విస్ట్ కూడా ఇచ్చినట్టు తెలుస్తోంది. సీఎంతో భేటీకి కేవలం నలుగురికి మాత్రమే ఛాన్స్ ఉంటుందని తేల్చి చెప్పారట. ముఖ్యంగా ఏపీలో టిక్కెట్ ధరల పెంపుతో పాటు సెకండ్ షో ప్రస్తావన తేనున్నారని తెలిసింది.
ఇక పన్నుల మినహాయింపులు, కరోనా దెబ్బతో విద్యుత్ చార్జీల మాఫీ లాంటి వాటిపై కూడా వారు చర్చించనున్నారట. ఏదేమైనా సినిమా వాళ్లకు జగన్ అపాయింట్‌మెంట్ ఇచ్చినా కేవలం నలుగురికే ఛాన్స్ ఇవ్వడంతో ఇప్పుడు వీరిలో ఎవరు వెళ్లాలి ? అన్నదానిపై కూడా తీవ్రస్థాయిలో తర్జనభర్జనలు నడుస్తున్నాయట