మెగా స్టార్ చిరంజీవి తనయుడిగా తెరంగేట్రం చేసినప్పటికీ రెండో సినిమాతోనే ఇండస్ట్రీ హిట్ కొట్టి తన సత్తా చాటుకున్న రామ్ చరణ్ కొన్నాళ్ల క్రితం వరుస ప్లాప్స్ తో కొంత ఇబ్బంది పడ్డాడు. ఏ సినిమా ఆడుతుంది .. ఏ కథ తన రేంజ్ లో ఉంటుంది .. అనే జడ్జిమెంట్ విషయంలో తన పంథా మార్చుకొని వరుసగా ధృవ తో సూపర్ హిట్ , రంగస్థలం తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టేశాడు. సినిమాలు హిట్లు అయ్యాయి కాబట్టి రామ్ చరణ్ ని మనం మెచ్చుకోవచ్చు.
కానీ అందరికీ తెలియాల్సిన విషయం ఏంటంటే హిట్ల కథలను ఎంచుకోవడంలోనే కాదు మనోడు తనదగ్గరికి వచ్చిన ప్లాప్ కథలను తిరస్కరించడం లోనూ ఎంతో చాకచక్యంగా వ్యవహరించడంతో భారీ పరాజయాలనుండి తప్పించుకున్నాడట. అయితే ప్రస్తుతం ఈయన వరుస సినిమాలకు సైన్ చేస్తూ బిజీ బిజీగా షూటింగ్ లల్లో పాల్గోంటున్నాడు. దర్శక ధీరుడు రాజమౌళి తో RRR..కొరటాల శివతో “ఆచార్య”..బ్లాక్ బస్టర్ డైరెక్టర్ తో “RC15” అనే సినిమాలు చేస్తున్నాడు. ఇంకా 3 బడా ప్రాజెక్ట్స్ రెడీగా లైన్ లో పెట్టుకుని ఉన్నాడు.
ఇక ఈయన వ్యక్తిగత విషయానికి వస్తే.. టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి కొడుకుగా ఎంత పేరు సంపాదించుకున్నాడొ..ఉపాసన భర్త గా కూడా అంతే మంచి పేరు సంపాదించుకున్నాడు. ఇక ఈ మెగా వారసుడికి ప్రాపర్టీస్ చాలానే ఉన్నాయి. ఇక అటు ఇటు గా ఈయన ఆస్తి విలువ 1500కోట్లు పైమాటనే అట. ఓ మీడియా గణాంకాల ప్రకారం 2021 ంqఅర్చి ఎండింగ్ కి 1500 కోట్ల రూపాయల ఆస్తి చరణ్ పేరు పై ఉందట. ఇక రాబోయే రోజుల్లో ఈయన ఆస్తి ట్రిపుల్ అయిన ఆశ్చర్యపోనక్కర్లేదు.