గోపీచంద్..ఆరు అడుగుల హైట్..ఆ ఎత్తుకు తగ్గ వెయిట్..ఆ కటౌట్ తో ఇండస్ట్రీలో మంచి పేరు సంపాదించుకున్నాడు.ఈయన తొలివలపు అనే చిత్రం తో రొమాంటిక్ హీరోగా సినీ ఇండస్ట్రీకు పరిచయం అయ్యారు. అప్పుడు ఈయన గురిచి చాలా మందికి తెలియదు.కానీ.. ఆ తర్వాత నటించిన జయం సినిమాతో..గోపీచంద్ అందరికి అభిమాన విలన్ గా మారిపోయాడు. జయం సినిమాలో ప్రతి నాయకుడిగా మారి అందరికి షాక్ ఇచ్చారు గోపిచంద్.
ఇక ఆ తరువాత నిజం, వర్షం సినిమాల్లో కూదా విలన్ గా నటించి అందరి దగ్గర మంచి మార్కులు కొట్టేసాడి గొపీచంద్. ఆయన పెర్ఫార్మన్స్ కి సినిమా విమర్శకులు సైతం ఫిదా అయ్యారు. అయితే, ఏమైందో ఏమో తెలియదు కానీ..కెరీర్ బాగా ముందుకు సాగుతున్న టైంలోనే గోపిచంద్..విలన్ గా ఆపేసి.. ఆ తర్వాత మళ్లీ హీరోగా నటించడం ప్రారంభించారు. ఈ క్రమంలోనే ఆయన 2004 నుంచి 2010 వరకు ఎన్నో యాక్షన్ సినిమాలు చేశారు. కానీ ఒక్కటి అంటే ఒక్కటి సినిమా కూడా హిట్ అవ్వలేదు. హిత్ పక్కన పెడితే కనీఅం పాజీటివ్ టాక్ ను కూడా సొంటం చేసుకోలేక పోయాయి ఆయన నటించిన సినిమాలు.
అయితే ఒక్క హిట్ కోసం ఆశ గా ఎదురుచూస్తున్న గోపిచంద్ కు..మొగుడు సినిమా మళ్లీ ఆయన సినీ కెరీర్ కు ప్రాణం పోసిన్నట్లైంది.ఈ సినిమా తో తాను కూడా ఫ్యామిలీ హీరోగా నటించి మెప్పించారు. దర్శకుడు కృష్ణవంశీ ఈ సినిమాలో కుటుంబ సభ్యుల మధ్య ఉండే స్నేహం, బాధ్యత, ప్రేమ, ఆప్యాయతలను చాలా చక్కగా చూపించడంతో..
ఈ చిత్రం ఫ్యామిలీ ఆడియన్స్ ని బాగా అలరించింది. ఈ సినిమా క్లైమాక్స్ లో ఎమోషనల్ సన్నివేశాల్లో గోపీచంద్ చూపించిన నటనా ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది. ఈ చిత్రం తర్వాత ఫ్యామిలీ హీరోగా గోపీచంద్ మారిపోయారు. కానీ,ఆయనకు అవకాశాలు మాత్రం రావడంలేదు. గోపిచంద్ విలన్ గా నటించినప్పుడే ఆయన కెరీర్ బాగా స్పీడ్ గా ఉన్నింది..హీరోగా మారిన తరువాత భారీ డిజాస్టర్ గా మారింది.