Movies'నిన్నే పెళ్లాడుతా' సినిమాను రిజెక్ట్ చేసిన ఆ స్టార్ హీరోయిన్ ఎవరో...

‘నిన్నే పెళ్లాడుతా’ సినిమాను రిజెక్ట్ చేసిన ఆ స్టార్ హీరోయిన్ ఎవరో తెలిస్తే..అసలు నమ్మలేరు..?

క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ణవంశీ దర్శకత్వంలో నాగార్జున, టబు హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం “నిన్నే పెళ్ళాడతా”. అప్పట్లో ఈ చిత్రం ఎంతటి విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ఇందులో టబు, నాగ్ కి పర్ఫెక్ట్ లవర్ గా నటించి మెప్పించింది. 1996 అక్టోబరు 4 న రిలీజ్ అయిన ఈ సినిమా అప్పట్లో సంచలనం సృష్టించింది. టాలీవుడ్ మన్మధుడు, కింగ్ నాగార్జునకు మహిళల్లో ఫాలోయింగ్ పెంచిన చిత్రం నిన్నే పెళ్లాడతానే. 1996లో వచ్చిన ఈ సినిమాకి ఏకంగా జాతీయ అవార్డు లభించింది.

అక్కినేని నాగార్జున కు యాక్షన్ జోనర్ లో ఆఖరిపోరాటం, మాస్ జోనర్ లో శివ, కామెడీలో హలోబ్రదర్, భక్తి రూపంలో అన్నమయ్య.. బ్లాక్ బస్టర్ హిట్స్ సాధిస్తే.. ఫ్యామిలీ జోనర్ లో బ్లక్ బస్టర్ ను ‘నిన్నే పెళ్లాడతా’ అందించింది. 90వ దశకంలో కుర్రాళ్లు, అమ్మాయిలకు తన స్టైల్ తో పిచ్చెక్కించిన నాగార్జున యువ సామ్రాట్ గా వెలిగిపోయాడు. నాగ్ స్టైల్, హెయిర్ స్టైల్ యూత్ పిచ్చెక్కిపోయారు. కాలేజీ అమ్మాయిలు ఫిదా అయిపోయారు. లవ్ స్టోరీకి ఫ్యామిలీ ఎమోషన్స్ మిక్స్ చేసి మ్యాజిక్ చేశాడు దర్శకుడు కృష్ణవంశీ. ప్రేక్షకులకు కొత్త తరహా టేకింగ్, మేకింగ్ చూపించి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు.

అయితే ఈ సినిమాకి ముందుగా అనుకున్న హీరోయిన్ టబు కాదట.. మీనా ని అనుకున్నారట. అప్పుడే ముత్తు సినిమా విడుదలై ప్రభంజనం సృష్టిస్తున్న సమయంలో.. మీనాకి ఫుల్ క్రేజ్ ఉండడంతో.. ‘నిన్నే పెళ్లాడ‌తా’లో హీరోయిన్‌గా ఛాన్స్ ఇచ్చారట క్ష్ణవంశీ.. అయితే ఈ సినిమాకి 60 రోజుల కాల్షీట్లు అడిగారట కృష్ణవంశీ.. అప్పటికే వరుస సినిమాలతో బిజీ ఫుల్ బిజీలో ఉన్న మీనా అన్ని రోజులంటే క‌ష్టం సార్ ఇవ్వలేనంటూ సినిమా నుంచి తప్పుకుందట. ఆ తరువాత ఈ సినిమాలో టబు నీ హీరోయిన్ గా పెట్టారు. ఆన్ స్క్రీన్ నాగ్ టబు ల కెమిస్ట్రీ సూపరో సూపర్..బొమ్మ బ్లాక్ బస్టర్.

 

 

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news