MoviesGood News: బాలయ్య ఫ్యాన్స్‌కి ఆ రోజు పండగే..హింట్ ఇస్తున్న ఆ...

Good News: బాలయ్య ఫ్యాన్స్‌కి ఆ రోజు పండగే..హింట్ ఇస్తున్న ఆ టీం మెంబర్స్..? 

యువ‌ర‌త్న‌, నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా బోయ‌పాటి శ్రీను ద‌ర్శ‌క‌త్వంలో అఖండ సినిమా తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే. కొద్దిరోజుల క్రితమే ఈ సినిమా టైటిల్‌ని ప్రకటిస్తూ.. ఓ టీజర్‌ని వదిలారు. టీజర్ నందమూరి అభిమనులను ఎంతగానో ఆకట్టుకుంది. ఇక  బోయ‌పాటి – బాల‌య్య కాంబో అంటే ఎంత క్రేజ్ ఉంటుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ఇప్పుడు అఖండ సైతం వీరి కాంబోలో ఖ‌చ్చితంగా హ్యాట్రిక్ కొడుతుంద‌న్న అంచ‌నాలు ఉన్నాయి. అందుకే అఖండ‌కు అదిరిపోయే బిజినెస్ జ‌రుగుతోంది. సాలిడ్ యాక్ష‌న్ సీక్వెన్స్‌తో వ‌స్తోన్న ఈ సినిమాను మిర్యాల ర‌వీంద‌ర్ రెడ్డి భారీ బ‌డ్జెట్ తో తెర‌కెక్కిస్తున్నారు.

అయితే , ఈ సినిమా రీలిజ్ డేట్ కోసం ఆయన అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. నిజానికి ఈ మధ్య అఖండ నుంచి పెద్దగా అప్‌డేట్స్‌ ఏమీ రాలేదు. దీంతో అభిమానులు కాస్త నిరుత్సాహంలో ఉన్నారు. అయితే అఖండ నుంచి అతి త్వరలోనే ఈ బిగ్ అప్‌డేట్ వస్తుంది అంటూ సినిమా నిర్మాణ సంస్థ ద్వారకా క్రియేషన్స్‌ ఓ ట్వీట్ చేసింది. సినీ వర్గాల దగ్గర నుండి అందుతున్న సమాచరం ప్రకారం.. ఈ వారాంతంలోనే ఈ సినిమాకు సంబంధించిన ఓ అధికారిక అప్‌డే వస్తుందనే వార్తలు సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది.

మరొవైపు  ఈ సినిమా కు సంబంధించి ఫస్ట్ సింగిల్  రిలీజ్ చేస్తరు అన్న టాక్ కూడా బలంగా వినిపిస్తుంది. ఒక్కవేళ ఈ వారాంతంలోనే అఖండ ఫస్ట్ సింగిల్ విడుదల చేస్తే అది అభిమానులకు నిజంగా గుడ్ న్యూసే..ఆ రోజు బాలయ్య అభిమానులకు ఓ పెద్ద పండగే అంటున్నారు సినీ పెద్దలు. మరి చూడాలి ఏం చేస్తారో మేకర్స్..ఆ అప్‌డేట్ ఫస్ట్ సింగిల్ గురించా.. లేక రిలీజ్ డేట్ గురించా అనే విషయం పై స్పష్టత రావాలి అంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news