యాదాద్రి భువనగిరిలోని కేకే ఆస్పత్రిలో దారుణం జరిగింది. ఓ మహిళకు ఆపరేషన్ చేసిన డాక్టర్లు… సర్జికల్ కాటన్ ను కడుపులోనే ఉంచి కుట్లు వేశారు. దీంతో ఆమెకు తీవ్రంగా కడుపు నొప్పి రావడంతో మహిళ మృతిచ్ఝెందింది. దీంతో కేకే ఆస్పత్రి వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. మహిళ మృతికి డాక్టర్లే కారణమంటూ మృతురాలి బంధువులు ఆందోళనకు దిగారు. ఆస్పత్రి ఫర్నీచర్‌ను ధ్వంసం చేశారు. దీంతో ఉత్రిక్తత వాతారవరం చోటు చేసుకుంది.
భూవనగిరిలోని కేకే ఆస్పత్రిలో గత ఏడాది అనారోగ్యం కారణంగా ఓ మహిళ ఆపరేషన్ చేయించుకుంది. అయితే కడుపులో కాటన్ మరచిపోయి డాక్టర్లు కుట్లు వేశారు. దాంతో ఏడాది కాలంగా తీవ్ర అనారోగ్యంతో మహిళ బాధపడుతోంది. పరిస్థితి విషమించడంతో హైద్రాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి కుటుంబ సభ్యులు తరలించారు. అయితే అప్పటికే మహిళ కడుపులో పాయిజన్ కాటన్ పాయిజన్ గా మారినట్టు వైద్యులు గుర్తించారు.
దీంతో అసలు మ్యాటే బయటపడింది. పరిస్థితి విషమించి ఆమె చనిపోయింది. మృతురాలి బంధువులు కేకే ఆస్పత్రి వద్ద ఆందోళనకు దిగారు. ఆమె డెడ్‌బాడీతో నిరసన తెలిపారు. ఆస్పత్రిపై దాడి చేసి, ఫర్నీచర్‌ను ధ్వంసం చేశారు. మృతురాలి కుటుంబానికి న్యాయం చేయాలని బంధువులు కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. ఇక ఈ ఘటనపై బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.