అక్కినేని హీరో నాగ చైతన్య, సాయి పల్లవి ప్రధాన పాత్రల్లో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ‘లవ్ స్టోరీ’ సినిమా రిలీజ్ అయిన విషయం తెలిసిందే. ఈ చిత్రం సెప్టెంబర్ 24 వ తేదీన థియేటర్స్‌లో ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. లవ్ స్టొరీ మొత్తంగా వరల్డ్ వైడ్ గా 1000 కి పైగా థియేటర్స్ లో గ్రాండ్ గా రిలీజ్ ను సొంతం చేసుకుంది. మొదటిరోజు నుంచే అన్నీ వర్గాల ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది చైతు – సాయి పల్లవిల లవ్ స్టోరి. ఈ మూవీపై పలువురు టాలీవుడ్ సినీ తారలు చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలుపుతూ.. ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.
ముఖ్యంగా మౌనిక, రేవంత్.. ఈ రెండు పాత్రలు సినిమాకి జీవం పోశాయనే చెప్పాలి. సున్నితమైన అంశాల్ని స్పృశిస్తూనే చక్కని భావోద్వేగాలతో శేఖర్ ఈ సినిమాని అద్భుతంగా తెరకెక్కించారు శేఖర్ కమ్ముల. మెుదటిరోజే ఊహకందని రీతిలో కలెక్షన్లను కొల్లగొట్టంది ఈ చిత్రం. ముఖ్యంగా ఈ సినిమాలో నాగ చైత్నయ యాక్టింగ్ అద్ర్స్ అనే చెప్పాలి. అయితే ఈ సినిమాని శేఖర్ కమ్ముల నాగ చైతన్య కోసం రాసుకోలేదట. ఓ మెగా హీరో కోసం రాసాడంటూ ఓ వార్త వైరల్ గా మారింది.
ఉప్పెన సినిమాతో టాలీవుడ్ లో ఫస్ట్ సినిమా తోనే రికార్డ్ కొల్లగొట్టిన మెగా హీరో వైష్ణవ్ తేజ్ తో ఈ సినిమాని చేయాలనీ అనుకున్నాడట డైరెక్టర్. కాగా ఇదే కథని శేఖర్ కమ్ముల వైష్ణవ్ కు వెళ్లి చెప్పగా.. అప్పుడే తీస్తున్న ఉప్పెన సినిమా కూడా లవ్ స్టోరీనే తరువత వెంటనే అలాంటి సినిమానే తీస్తే బాగుండదని ఈ సినిమాకి నో చెప్పాడట వైష్ణవ్. అయితే దీని పై అటు వైష్ణవ్ తేజ్ నుండి గానీ ఇటు శేఖర్ కమ్ముల నుండి గాని ఎటువంటి అధికారిక ప్రకటన రాకపోవడం గమనార్హం.