తెలుగులో కామెడీ సినిమాల గురించి మాట్లాడుకోవాల్సి వస్తే ముందుగా గుర్తొచ్చేది నువ్వు నాకు నచ్చావ్ సినిమానే. త్రివిక్రమ్ కలం నుంచి వచ్చిన మాటల మణిహారమే ఈ నువ్వునాకునచ్చావ్. అప్పటికే ఒక పక్క ఫ్యామిలీ హీరోగా సినిమాలు చేస్తూ మరోపక్క యాక్షన్ సినిమాలు చేస్తూ విక్టరీ వెంకటెష్ టాలీవుడ్ లో మంచి ఫామ్ లో ఉన్న సమయంలో అసలు పెద్ద ప్రయోగమే చేశారని చెప్పచ్చు.
“నువ్వు నాకు నచ్చావ్”.. సినిమా లో వెంకటేష్, ఆర్తి అగర్వాల్ హీరోహీరోయిన్లుగా నటించగా… ప్రకాష్ రాజు, సుదీప పింకీ, బ్రహ్మానందం ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి కె. విజయభాస్కర్ స్క్రీన్ ప్లే అందించడంతో పాటు దర్శకత్వం కూడా తానే వహించారు. ఈ సినిమాకి కథ, డైలాగులు త్రివిక్రమ్ శ్రీనివాస్ అందించారు. నిజానికి ఒక సాధారణ కథకి మంచి డైలాగులు అందించి ఈ సినిమాని బ్లాక్ బస్టర్ హిట్ చేయడంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ కీలకమైన పాత్ర వహించారని చెప్పుకోవచ్చు.
అయితే ఈ సినిమాలో ఆర్తి అగర్వాల్ చెల్లెలుగా చేసిన “పింకీ”అందరికీ గుర్తుండే ఉంటుంది కదా.. ఈ సినిమాలో వెంకీ థిస్ ఇస్ పింకీ అంటూ వెంకీతో తెగ అల్లరి చేసిన చైల్డ్ ఆర్టిస్ట్ అసలు పేరు సుదీప. ఈ సినిమాతో ఫుల్ క్రేజ్ తెచ్చుకుంది సుదీప. 1994లో రవిరాజా పిన్నెశెట్టి దర్శకత్వంలో, మోహన్ బాబు హీరోగా వచ్చిన Mr. ధర్మరాజుMA ఆ సినిమాతో ఆమె తెలుగు చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చింది.
ఆ తర్వాత ఎన్నో సినిమాల్లో నటించిన కానీ ఆమెకి పెద్దగా గుర్తింపు అయితే రాలేదు. వెంకటేష్ హీరోగా వచ్చిన నువ్వు నాకు నచ్చావ్ సినిమాలోని పింకీ పాత్ర ఆమెకి ఫుల్ క్రేజ్‌ని తీసుకువచ్చింది. ఆ తర్వాత ఎక్కువగా హీరోలకి చెల్లెలు పాత్రలోనే నటించింది సుదీప. కాగా ఎంబీఏ పూర్తి చేసిన సుదీప.. శ్రీరంగనాథ్ అనే సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ను వివాహం చేసుకుని.. ప్రస్తుతం ఆమె క్లాసికల్ డాన్స్ స్కూల్ ని నడిపిస్తున్నట్టుగా టాలీవుడ్ ప్రముఖుల దగ్గర నుండి టాక్ వినిపిస్తుంది.