Newsఅసలు పవర్ స్టార్ అనే బిరుదు పవన్ కళ్యాణ్ కి ఎలా...

అసలు పవర్ స్టార్ అనే బిరుదు పవన్ కళ్యాణ్ కి ఎలా వచ్చిందో తెలుసా..??

పవన్ కళ్యాణ్.. ఆ పేరులోనే ఓ పవర్ ఉంది. ఆ పేరు చెబుతుంటేనే ఆయన అభిమానులు పూనకాలు వచ్చిన్నట్లు ఊగిపోతుంటారు. మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా సినీ ఇండస్ట్రీలో అడుగు పెట్టిన పవన్..టాలీవుడ్ కి ఎన్నో భారి బ్లాక్ బస్టర్ సినిమాలను అందించాడు. అన్న స్టార్ హీరో అయినంత మాత్రాన తమ్ముడు కూడా స్టార్ హీరో అవ్వాలంటే ఈ రంగుల ప్రపంచంలో కుదరదు. మనకంటూ ఓ టాలెంట్.. ఏదైన సాధించాలనే కృషి.. పట్టుదల ఉండాలి.. అప్పుడే మనం మనదారిలో పూర్తిగా సక్సెస్ అవ్వగలం. అందుకు ప్రత్యేక నిదర్శనం “పవన్”. సినీ న‌టుడిగా ప‌వ‌న్ క‌ల్యాణ్ స్టార్ డ‌మ్ ఏంట‌న్న‌ది అంద‌రికీ తెలిసిందే. అంద‌రిక‌న్నా భిన్నంగా సాగిపోయే ఆయ‌న ఫ్యాన్ ఫాలోయింగ్ చూస్తే.. ఎవ్వ‌రికైనా మైండ్ బ్లోయింగ్ అనిపిస్తుంది.

నేడు జనసేనాని పవన్ కళ్యాణ్ 50 వ పుట్టిన రోజు. తనలో ఎక్కువ సామజిక సృహ దేశంకోసం మరేదో చెయ్యాలనే తపన, తన మాటల్లో తన చేతల్లో తన సినిమాల్లో మనం తరచూ చూస్తుంటాం. అది బహుశా ఆయన పెరిగిన వాతావరణం వల్ల కావచ్చు లేదా తను చుట్టూ చుసిన సమాజం కావచ్చు లేదా తనకు స్వయంగా ఎదురైన అనుభవాలు కావచ్చు లేదా తాను ఎక్కువగా చదివిన సోషలిస్టు, కమ్యూనిస్టు తరహా పుస్తకాల ప్రభావం వల్ల కూడా కావచ్చు. అందువల్ల ఆయనలో ఈ దేశంలో ఈ సమాజంలో ఉన్న అంతరాలు మరియు ప్రజలకి జరుగుతున్న అన్యాయం పట్ల నిరంతర మధనం వల్ల ఆయన అలా భిన్నంగా ఉన్నారని కూడా చెప్పవచ్చు

పేరుకి చిరంజీవి తమ్ముడే అయినా.. ఆయన ఏనాడు ఆ పేరు వాడుకోలేదు.. తన కష్టంతో..తన నటనతో..మంచి సినిమాలను ఎంపిక చేసుకుని..ట్రెండ్ ఫాలో అవ్వకుండా..ట్రెండ్ సెట్ చేసుకున్నాడు పవన్. అందుకే ఆయ‌నకు కోట్లల్లో అభిమానులు ఉంటారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అనే పేరు చెబుతుంటేనే వాళ్ళకు పూనకాలు వచ్చేస్తాయి.. నిజానికి పవన్ కల్యాణ్ ని వాళ్ల అభిమానులు ఓ హీరోగా చూడరు.. దేవుడిగా ఆరాధిస్తారు. పవన్ అంటే పిచ్చి ప్రేమ వాళ్లకి.

ఇక పవన్ కళ్యాణ్ నటించిన ‘గోకులంలో సీత’ చిత్రానికి పోసాని కృష్ణమురళి మాటలు అందించిన్ విషయం తెలిసిందే. ఇక ఈ చిత్రం విడుదల సందర్భంగా పోసాని మాట్లాడుతూ. తొలిసారిగా విలేకరుల సమావేశంలో పవన్ కళ్యాణ్‌ను పవర్ స్టార్ అని సంబోధించారు. ఈంతో అప్పటి నుండి పత్రికలు పవన్ కళ్యాణ్ పేరుకు ముందు పవర్ స్టార్ బిరుదుతో కథనాలు రాశాయి. అయితే ఫస్ట్ టైం సూపర్ గుడ్ ఫిల్మ్స్ బ్యానర్‌లో వచ్చిన ‘సుస్వాగతం’ సినిమాకి తొలిసారిగా పవన్ కళ్యాణ్ పేరుకు ముందు పవర్ స్టార్ బిరుదుతో టైటిల్ కార్డ్ వేశారు. ఇలా పవన్ కల్Yఆణ్ కి పవర్ స్టార్ అనే పేరు వచ్చిందనమాట.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news