Moviesవామ్మో..దానికోసం ఎన్టీఆర్ ఎన్ని లక్షలు ఖర్చుపెట్టారో తెలుసా..? స్పెషాలిటీ ఇదే..!!

వామ్మో..దానికోసం ఎన్టీఆర్ ఎన్ని లక్షలు ఖర్చుపెట్టారో తెలుసా..? స్పెషాలిటీ ఇదే..!!

యంగ్ టైగర్ ఎన్టీఆర్‌కు కార్లు అంటే ఎంతిష్టమో అందరికీ తెలిసిందే. కొత్త కొత్త మోడల్స్‌ను కొనడం యంగ్ టైగర్‌కు మక్కువ. మార్కెట్‌లోకి కొత్త కారు వచ్చిందంటే చాలు.. తమ వాకిట్లో ఉండాలనుకుంటారు ఎన్టీఆర్. ఈయన దగ్గర కార్స్ కలెక్షన్స్ చాలానే ఉంది. ఎప్పుడూ ఒకే కారులో తిరగడం యంగ్ టైగర్‌కు అస్సలు నచ్చదు. అందుకే ఎప్పటికప్పుడు ట్రెండ్‌ను బట్టి కార్లు మారుస్తూనే ఉంటాడు.

ఖరీదైన కార్లు మెయింటెన్ చేసే వారిలో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కూడా ఒకరు. లగ్జరీ ఫీచర్స్‌తో పాటు సేఫ్టీకి కూడా ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చే ఎన్టీఆర్.. అలాంటి కార్లు ఎక్కడున్నా, ఎంత ఖర్చయినా వాటిని ఇష్టంగా తెప్పించుకుంటారనే పేరుంది. అయితే నచ్చిన కారు కొనడమే కాదు.. దానికి తగ్గట్టే తనకు నచ్చిన నెంబర్ బోర్డ్ కోసం లక్షలు ఖర్చు చేస్తుంటారు తారక్. తాజాగా ఓ ఫ్యాన్సీ నంబర్‌ కోసం ఏకంగా 17 లక్షలు ఖర్చు చేసారు తారక్.

ఈ మధ్యే కోట్లు ఖర్చు పెట్టి లంబోర్ఘిని ఊరుస్‌ కారును కొనుకున్న విషయం తెలిసిందే. ఇక ఆ కారు కోసం కోట్లు పెట్టిన తారక్‌ ఫ్యాన్సీ నంబర్‌ దక్కించుకున్నారు. తాజాగా ఖైరతాబాద్‌ ఆర్టీఏ అధికారులు ఫ్యాన్సీ నంబర్లకు వేలం వేశారు. ఇందులో జూనియర్‌ ఎన్టీఆర్‌ రూ.17 లక్షలు పెట్టి ట్శ్ 09 FS 9999 నంబర్‌ దక్కించుకున్నాడు. మంగళవారం జరిగిన అన్ని ఫ్యాన్సీ నంబర్ల వేలంలో ఇదే హయ్యస్ట్‌ బిడ్‌ అని అధికారులు చెప్తున్నారు.

తాత కారు నెంబర్ 9999 అలాగే తన తండ్రి స్వర్గీయ హరికృష్ట కూడా అదే నెంబర్ వాడేవారని.. అందుకే తను 9 నెంబర్ అంటే అంత ఇష్టమని తారక్ పలు ఇంటర్వ్యుల్లో చెప్పుకొచ్చాడు. తను ఏ కారు తీసుకొచ్చినా కూడా 9999 మాత్రమే ఉంటుందని క్లారిటీ ఇచ్చాడు. అయితే ఇక్కడ మరో విశేషం ఏంటంటే కారు నంబర్‌తో పాటు ఎన్టీఆర్ ట్విటర్‌ ఖాతా కూడా @Tarak9999 అని ఉంటుంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news