ప్రముఖ దర్శకుడు కోడి రామకృష్ణ దర్శకత్వం వహించిన సినిమా అరుంధతి. ఈ సినిమా అనుష్క సినీ కెరీర్ ని మార్చేసింది. ఆమె కెరీర్లో ఇదొక ప్రత్యేకమైన సినిమా. ఈమె ఏ పాత్రలోనైనా ఇట్టే లీనమై పోతుందని చెప్పేందుకు అరుంధతి నిదర్శనం. ఆ తర్వాత పలు సినిమాలలో లేడి ఓరియంటెడ్ చిత్రాల్లో నటించిన అనుష్క ఎన్నో హిట్లు కొట్టింది. అరుంధతి సినిమాకు శ్యామ్ ప్రసాద్ రెడ్డి నిర్మాతగా వ్యవహరించారు. ఈ సినిమాలో గ్రాఫిక్స్ కూడా చాలా అద్భుతంగా ఉంటాయి.
జేజమ్మ పాత్రకు అనుష్క పూర్తి న్యాయం చేస్తే, పశుపతి పాత్రలో సోనుసూద్ అత్యద్భుతంగా నటించి, తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు.. ఈ సినిమాలో ఫ్లాష్ బ్యాక్ లో అరుంధతికి తండ్రి పాత్రలో శంకర్ అనే నటుడు నటించారు. ఈయన సీరియల్స్ ద్వారా ప్రేక్షకులకు పరిచయమైనా అరుంధతి సినిమా ద్వారానే మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఈయన కొడుకులు కూడా తెలుగు ప్రేక్షకులకు బాగా సుపరిచితులైన హీరోలు కావడం గమనార్హం.
ఈ శంకర్ కుమారులు ఎవరో కాదు.. తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన కృష్ణ కౌశి, బాలాదిత్య. బాలాదిత్య మొదట బాలనటుడిగా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి , ఆ తర్వాత హీరోగా తన పాపులారిటీని పెంచుకున్నారు. చంటిగాడు అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యి… 1940లో ఒక గ్రామం సినిమాకు అవార్డులను సైతం సొంతం చేసుకున్నాడు. ఇకపోతే ప్రస్తుతం పలు రియాల్టీ షోలకు హోస్ట్ గా వ్యవహరిస్తు, బిజీగా ఉన్నాడు బాలాదిత్య.
ఇక ఈయన పెద్దకొడుకు కృష్ణ కౌశిక్ కూడా కొన్ని పదుల సంఖ్యలో బుల్లితెర ధారావాహిక లో నటించి ,సీరియల్ నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక సినీ ఇండస్ట్రీలో కేవలం కొన్ని సినిమాల్లో నటించినప్పటికీ బుల్లితెర పైనే మంచి గుర్తింపును పొందాడు.