Gossipsచిరంజీవి "గాడ్ ఫాదర్" సినిమాలో ఆ లేడీ పొలిటీషియన్..హీట్ ఎక్కిస్తున్న క్రేజీ...

చిరంజీవి “గాడ్ ఫాదర్” సినిమాలో ఆ లేడీ పొలిటీషియన్..హీట్ ఎక్కిస్తున్న క్రేజీ అప్డేట్..?

మెగాస్టార్ చిరంజీవి మలయాళ ‘లూసిఫర్’ చిత్రాన్ని కూడా రీమేక్ చేయనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తెలుగు సహా దక్షిణాదిలోని అన్ని భాషల్లోనూ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అన్ని చోట్లా దీనికి భారీ స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు దీన్నే ‘గాడ్ ఫాదర్’గా చిరంజీవి రీమేక్ చేస్తున్నారు. మోహ‌న్ రాజా ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్న ఈ మూవీ చిత్రీక‌ర‌ణ ఇప్ప‌టికే షురూ అయింది.

ఈ సినిమా మొదలైనప్పటి నుండి రోజుకో వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మార్తుంది. ఇక స్టార్టింగ్ లో ఈ సినిమా ఒరిజిన‌ల్ వెర్ష‌న్ లో పృథ్విరాజ్ సుకుమార‌న్ చేసిన పాత్ర కోసం ..బాలీవుడ్ కండల వీరుడు ..స్టార్ హీరో స‌ల్మాన్ ఖాన్ ను అనుకున్నారట. అయితే ఆయన నో చెప్పారని.. ఎందుకంటే.. ఈ సినిమాలో పృథ్విరాజ్ సుకుమార్ పాత్ర నిడివి 5 నిమిషాలే ..అందుకే సల్మాన్ అంతగా ఇంట్రస్ట్ చూపించట్లేదని ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న తరుణంలోనే..చిరంజీవి ‘గాడ్ ఫాదర్’ మూవీలో డాన్ పాత్రను సల్మాన్ ఖానే ఓకే చేసారనే టాక్ బయటకి వచ్చింది.

అయితే ఇప్పుడు తాజాగా మరో వార్త నెట్టింట వైరల్ గా మారింది. అది ఏమిటంటే..ఈ గాడ్ ఫాదర్ సినిమాలో సీనియర్ నటి కుష్భూ ఓ కీలక పాత్రలో నటిస్తుందట. గతంలో వీరిద్దరు కలిసి ‘స్టాలిన్’ సినిమాలో అక్క తమ్ముడిగా నటించిన విషయం తెలిసిందే. ఈ సినిమా బ్లాక్‌బస్టర్ హిట్ సాధించింది. ఇప్పుడు మరోసారి వీరిద్దరు కలిసి ఈ సినిమాలో నటిస్తున్నారు అని వార్త తెలియడంతో మెగా అభిమానుల్లో రెట్టింపు ఉత్సాహం నెలకొంది. మరి చూడాలి ఈ సినిమాతోనైనా కుష్భూ కి తెలుగులో అవకాశాలు వస్తాయి ఏమో..??

 

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news