మెగాస్టార్ చిరంజీవి..టాలీవుడ్ లో సీనియర్ టాప్ హీరో. టాలీవుడ్ కి ఎటువంటి సినిమా బ్యాక్ గ్రౌండ్ లేకుండా చలన చిత్ర పరిశ్రమలో అడుగు పెట్టి.. స్వయం కృషితో ఎదిగిన ఒకెఒక్క స్టార్ హీరో మెగాస్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న హీరో మన చిరంజీవి. హీరోగా అడుగు పెట్టినా .. తనకు వచ్చిన ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకుంటూ కష్టఫడి ఒకొక్క మెట్టు ఎక్కుతూ.. దాదాపు 20ఏళ్ళు టాలీవుడ్ నెంబర్ వన్ హీరోగా తెలుగు చిత్ర సీమను ఏలారు మెగాస్టార్ చిరంజీవి. యంగ్ జనరేషన్ నటీనటులకు ఆదర్శప్రాయంగా నిలుస్తున్న మెగాస్టార్ చిరంజీవి.
సినిమా ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎలాంటి సినీ నేపథ్యం లేకున్నప్పటికీ తన నటన ద్వారా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన చిరంజీవి నటుడు అల్లూరి రామలింగయ్య కూతురు సురేఖను పెళ్లి చేసుకున్న సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే చిరంజీవి దంపతులకు ఇద్దరు అమ్మాయిలు ఒక అబ్బాయి జన్మించారు. అందరు వాళ్ళ వాళ్ల లైఫ్ లో బాగా సెటిల్ అయ్యారు. ఇక అసలు విషయానికి వస్తే..తాగాగా సోషల్ మీడియాలో మెగాస్టార్ చిరంజీవి కన్నీళ్లు పెట్టుకున్న ఓ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
సినీ ఇండస్ట్రీలో ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న మెగాస్టార్ చిరంజీవి.. ఒక వీడియో చూసి బాగా ఎమోషనల్ అవ్వడంతో ఆ వీడియో కాస్త హాట్ టాపిక్ గా నిలిచింది. ప్రముఖ మీడియా ఛానల్ ఈ టీవీ కార్యక్రమానికి గెస్ట్ గా వచ్చిన మెగాస్టార్ చిరంజీవికి ఈటీవీ వారు గతంలో రూపొందించినటువంటి ఒక వీడియోను చూపించారు. ఆ వీడియోలో తమ పిల్లలు రామ్ చరణ్ తేజ్, వరుణ్ సందేశ్, అల్లుఅర్జున్ ఒక్కొక్కరుగా డాన్స్ పర్ఫార్మెన్స్ చేస్తుంటే మెగాస్టార్ చిరంజీవి ఎంతో ఆనందంగా కనిపిస్తారు. ఈ క్రమంలోనే చిరంజీవి కూతురు శ్రీజ ఏదో విషయానికి అలిగినపుడు..చిరంజీవి తనని ఎంతో ప్రేమగా దగ్గరకు తీసుకొని బుజ్జస్తారు. ఈ విధంగా పిల్లలందరితో కలిసి ఎంతో సరదాగా గడిపిన ఈ వీడియోని చూసి మెగాస్టార్ చిరంజీవి ఎంతో ఎమోషనల్ అయ్యారు. ఆ వీడియో సుమారు 20 సంవత్సరాల క్రితం దిగా తెలుస్తుంది.