Moviesచిరంజీవి పెళ్లి టైంలో అల్లు రామలింగయ్య .. సురేఖ గురించి ఏం...

చిరంజీవి పెళ్లి టైంలో అల్లు రామలింగయ్య .. సురేఖ గురించి ఏం చెప్పారో తెలిస్తే కన్నీళ్ళు ఆగవు..!!

కష్టపడితే మనిషి మహోన్నత స్థానానికి ఎదుతాడనే దానికి నిలువెత్తు నిదర్శనం మెగాస్టార్ చిరంజీవి. 1979లో ప్రాణం ఖరీదు చిత్రంతో కెరీర్ ను స్టార్ట్ చేసిన చిరు తన సినీ కెరీర్ లో అనేక ఎత్తు పల్లాలను, సవాళ్లను ఎదుర్కొని ఈరోజు మెగాస్టార్ గా తెలుగు ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోయారు. తన మెగా హిట్స్ తో తెలుగు సినిమా స్టామినా పెంచిన మెగాస్టార్ బాక్సాఫీస్ కింగ్ గా వెలిగారు. చిరంజీవి అల్లు రామలింగయ్య కూతురు ను పెళ్లి చేసుకున్నాడన్న విషయం తెలిసిందే.

మెగా ఫ్యామిలీకి మూలమైన చిరంజీవి.. సినిమా ఇండస్ట్రీలోకి ఎలాంటి సపోర్ట్ లేకుండానే వచ్చారు. మంచి నటుడిగా పేరు తెచ్చుకుంటున్న సమయంలోనే ప్రముఖ సీనియర్ కమెడియన్ అల్లు రామలింగయ్య తన కుమార్తెసురేఖను చిరంజీవికిచ్చి పెళ్లి చేశారు. పెళ్లి అయిన వేళా విశేషమో ఏమో కానీ.. క్రమంగా చిరంజీవికి ఎక్కువ సినిమాలు రావడం.. క్రమంగా ఆయన హీరోగా నిలదొక్కుకోవడం జరిగాయి. అయితే మెగాస్టార్ ని ఇంటి అల్లుడు గా రామలింగయ్యగారు ఎలా చేసుకున్నారో తెలుసా…. ఒకప్పుడు మేకప్ మెన్ గా పనిచేసిన జయకృష్ణ.. తరువాత నిర్మాతగా మారారు.. ఆయన చిరంజీవికి మరియు అల్లు రామలింగయ్య గారికి సన్నిహితులు.

ఒకరోజు ఆయన చిరంజీవిని వెంటపెట్టుకుని రామలింగయ్యగారి ఇంటికి వెళ్లారు.. ఆ సమయంలో రామలింగయ్య గారు ఇంట్లో లేకపోవడంతో వారి భార్య బయటికి వచ్చి పలకరించి కాఫీ పంపించారట. పెళ్లి అయ్యాక తెలిసిందట చిరంజీవికి ఆ కాఫీ చేసింది సురేఖ అని ఈ విషయాన్ని చిరంజీవి ఒక ఇంటర్వ్యూలో గుర్తు చేసుకున్నారు. అంతేకాదు..చిరంజీవి సురేఖా ల పెళ్ళి జరిగేటప్పుడు రామలింగయ్య చిరంజీవితో.. “బాబు నువ్వేమో కొంచెం స్పీడు..దూకుడు గల మనిషివి.

కానీ,మా సురేఖ అలాంటిది కాదు. మా ఇంట్లో అర‌వింద్‌, భార‌తి, వ‌సంత అంద‌రూ కూడా మొహానే ఉన్నది ఉన్నట్లు మాట్లాడే మనస్తత్వం కలవారు. సురేఖా ఒక్కటేఅ నెమ్మ‌ద‌స్తురాలు. ఏ విష్యమ బయటకు చెప్పుకునే టైప్ కాదు. ఆమెను బాగా చూసుకోవాల‌య్యా..” అంటూ చిరంజీవికి చెప్పారట అల్లు రామలింగయ్య. ఇక మామాకు ఇచ్చిన మాట ప్రకారం అల్లు రామలింగయ్య చెప్పినట్లుగానే సురేఖను చాలా బాగా చూసుకుంటున్నారు మన మెగాస్టార్ చిరంజీవి.

Latest news