ఐకాన్ స్టార్’ అల్లు అర్జున్, బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ కాంబోలో వస్తున్న మోస్ట్ అవైటెడ్ అండ్ ప్రెస్టీజియస్ పాన్ ఇండియా మూవీ ‘పుష్ప’.. మైత్రీ మూవీస్, ముత్తంశెట్టి మీడియా సంస్థలు కలిసి భారీ స్థాయిలో నిర్మిస్తున్నాయి. రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తుండగా.. మలయాళీ వెర్సటైల్ యాక్టర్ ఫాహద్ ఫాజిల్ విలన్‌గా టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారు.
బన్నీ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న ‘పుష్ప’ మూవీ గురించి వస్తున్న అప్‌డేట్స్ సినిమా పట్ల ఉన్న ఆసక్తిని రెట్టింపు చేస్తున్నాయి. అల్లు అర్జున్ ఫస్ట్ పాన్ ఇండియా మూవీ కావడంతో ఈ సినిమాపై స్పెషల్ కేర్ తీసుకుంటున్నారు డైరెక్టర్ సుకుమార్. అయితే ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ అయిన వెంటనే..వకీల్ సాబ్ సినిమాతో టాలీవుడ్ ని షేక్ చేసిన డైరెక్టర్ వేణు శ్రీరామ్ దర్శకత్వంలో.. స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీకి వేణు శ్రీరామ్ ఐకాన్ అనే టైటిల్ ఫిస్ చేసారు. దీనికి కనుబడుట లేదు అనే ట్యాగ్ లైన్ ఉంటుంది. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మించనున్నారు.
అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దగ్గర నుండి అల్లు అర్జున్ కోసం అద్దిరిపోయే కధతో రెడీగా ఉన్నాడట. అంతేకాదు ఇంకా బన్నీ లిస్ట్‌లో కొరటాల శివ, ప్రశాంత్ నీల్,ఏఆర్ మురుగదాస్ తదితర దర్శకులు కూడాఉన్నారట. ఇప్పుడు వారిలో ఏ దర్శకుడితో ఎప్పుడు సినిమా చేయలన్నది బన్నీ కీ పెద్ద తల నోప్పిగా మారిందట. మరోవైపు బన్నీ నటిస్తున్న పుష్ప చిత్రం రెండు భాగాలుగా రూపొందనున్న విషయం తెలిసిందే.తొలి పార్ట్ క్రిస్మస్‌కి విడుదల కానుండగా, రెండో పార్ట్ రిలీజ్‌పై సందిగ్ధం నెలకొని ఉంది. ఇక ఇప్పుడు తదుపరి సినిమా ఏ డైరెక్టర్ తో చేస్తే బాగుంటుందని ఆలోచిస్తున్నాడట. మరి చూడాలీ బన్నీ ఏ డెసిషన్ తీసుకుంటారో..ఏ డైరెక్టర్ కి గ్రీన్ సిగ్నల్ ఇస్తాడో..??