గోపీచంద్..ఆరు అడుగుల హైట్..ఆ ఎత్తుకు తగ్గ వెయిట్..ఆ కటౌట్ తో ఇండస్ట్రీలో మంచి పేరు సంపాదించుకున్నాడు.ఈయన తొలివలపు అనే చిత్రం తో రొమాంటిక్ హీరోగా సినీ ఇండస్ట్రీకు పరిచయం అయ్యారు. అప్పుడు ఈయన గురిచి చాలా మందికి తెలియదు.కానీ.. ఆ తర్వాత నటించిన జయం సినిమాతో..గోపీచంద్ అందరికి అభిమాన విలన్ గా మారిపోయాడు. జయం సినిమాలో ప్రతి నాయకుడిగా మారి అందరికి షాక్ ఇచ్చారు గోపిచంద్.
అయితే, ఏమైందో ఏమో తెలియదు కానీ..కెరీర్ బాగా ముందుకు సాగుతున్న టైంలోనే గోపిచంద్..విలన్ గా ఆపేసి.. ఆ తర్వాత మళ్లీ హీరోగా నటించడం ప్రారంభించారు. కానీ ఒక్కటి అంటే ఒక్కటి సినిమా కూడా హిట్ అవ్వలేదు. హిట్ పక్కన పెడితే కనీఅం పాజీటివ్ టాక్ ను కూడా సొంటం చేసుకోలేక పోయాయి ఆయన నటించిన సినిమాలు. ఇక సినిమాలకు గ్యాప్ ఇచ్చిన ఈయాక్షన్ హీరో.. మాస్ హీరోగా ఇప్పటి వరకు మంచి మంచి సినిమాలతో అలరిస్తూ వచ్చిన గోపీచంద్ ఇటీవల సిటీమార్ చిత్రం తో ప్రేక్షకులను ఎంతగానో అలరించాడు. ఆ చిత్రం సూపర్ హిట్ కావడమే కాకుండా గోపీచంద్ స్టామినా ను కూడా టాలీవుడ్ కి తెలియజేసింది. ఇక ఈ సినిమా హిట్ టాక్ తో ఆయనకు మళ్లి టాలీవుడ్ నుండి అవకాశాలు అందుకుంటున్నారు.
ఇదిలా ఉంటే.. గోపీచంద్ హీరోగానే చాలా మందికి తెలుసు. కానీ, ఒకప్పుడు సంచలన చిత్రాలకు కేరాఫ్ అడ్రెస్ అయిన సుప్రసిద్ద దర్శకుడు తొట్టెంపూడి కృష్ణ కుమారుడని తక్కువ మందికి తెలుసు. అతి తక్కువ బడ్జెట్‌తో ఒక ప్రయోజనాత్మక చిత్రాన్ని రూపొందించటం టి. కృష్ణ గారికే సాధ్యమయిందంటే అతిశయోక్తి కాదు. ఇక తాను నమ్మిన సిద్ధాంతాలపై ఎక్కడా రాజీపడని టి. కృష్ణ కేవలం మూడు పదుల వయసులోనే ఎన్నో విషయాలను అందుకున్నాడు. అలాంటి గొప్ప వ్యక్తి 1986లో క్యాన్సర్ కారణంగా మరణించారు. అయితే భౌతికంగా టి.కృష్ణ దూరమైనా ఆయన తీసిన సినిమాలు నేటికీ తెలుగుప్రేక్షకుల మదిలో చిరస్థాయిగా నిలిచే ఉన్నాయి.