Moviesనా జీవితంలో ఆమెకు ఓ స్పెషల్ ప్లేస్.. ప్రత్యేకమైన ఫోటోను షేర్...

నా జీవితంలో ఆమెకు ఓ స్పెషల్ ప్లేస్.. ప్రత్యేకమైన ఫోటోను షేర్ చేసిన బన్నీ..!!

మెగా కాపౌండ్ నుంచి ఎంట్రీ ఇచ్చి అంచెలంచెలుగా ఎదుగుతూ తనకంటూ ప్రత్యేక అభిమాన వర్గాన్ని కూడగట్టుకున్నారు అల్లు అర్జున్. మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడు, బడా నిర్మాత అల్లు అరవింద్ కుమారుడిగా 2003 సంవత్సరంలో ‘గంగోత్రి’ సినిమాతో సినీరంగ ప్రవేశం చేసిన అల్లు అర్జున్.. తొలి సినిమాతోనే విజయం అందుకున్నారు. ఆ తర్వాత కూడా చేస్తున్న ప్రతి సినిమాలోనూ కొత్తదనం చూపిస్తూ ముందుకెళ్లిన ఆయన.. తెలుగు ప్రేక్షకుల్లో తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు. మేనమామ మెగాస్టార్‌ చిరంజీవి డాడీ చిత్రంలో నటుడిగా పరిచమైన ఐకాన్‌ స్టార్‌ గా ఎదిగాడు.

టాలీవుడ్‌లో అనోన్యమైన జంటల్లో అల్లు అర్జున్, స్నేహారెడ్డిల జంట ఒకటి. వీళ్లిద్దరు ప్రేమించుకొని ఒకరినొకరు పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. 6 మార్చి 2011లో వీళ్లిద్దరి మ్యారేజ్ జరిగింది. ఈ రోజు అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి పుట్టినరోజు. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో వేదికగా బన్నీ అభిమానులు స్నేహారెడ్డికి పెద్ద సంఖ్యలో పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతున్నారు. ఇక స్టైలిష్ స్టార్ తన భార్యకు అంతే స్టైలిష్ ఫొటోతో స్పెషల్ గా విష్స్ చేశారు.

నా జీవితంలోనే ప్రత్యేకమైన వ్యక్తివి నువ్వు.. నువ్వు నా లైఫ్ లో ఉండటం నా అదృష్టం.. అంటూ తనదైన స్టైల్ లో భార్యకు తన ప్రేమను బర్త్ డే విషెస్ తెలుపుతూ ఇంస్టాగ్రామ్ లో భార్యతో ఉన్న అద్భుతమైన ఫోటోను షేర్ చేశారు అల్లు అర్జున్. ఇక అల్లు అర్జున సుకుమార్ దర్శకత్వంలో పుష్ప సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రేజీ కాంబో పై భారి అంచనాలు పెట్టుకున్నారు అభిమానులు.

 

 

View this post on Instagram

 

A post shared by Allu Arjun (@alluarjunonline)

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news