Moviesయస్..నచ్చితే కమిట్ అయిపోతా..ఏం లెక్క చేయను..?

యస్..నచ్చితే కమిట్ అయిపోతా..ఏం లెక్క చేయను..?

ఈ రంగుల ప్రపంచంలో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరు చెప్పలేరు. సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ లు స్టార్ డం సంపాదించాలంటే చాలా కష్టపడాల్సి వస్తుంది…సరే ఇంత కష్టపడ్డాకన్నా స్టార్ హీరోయిన్ల లిస్ట్ లో చేరుతామా అంటే లేదు. కష్టపడడం తో పాటు.. అదృష్టం కూడా కలిసి రావాలి. ఇక మరికొంతమంది అయితే కేవలం ఒక్క సినిమాతోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగిన వారు చాలా మంది ఉన్నారు. ఇక మరికొంతమంది హీరోయిన్లు తొందరగానే ఫేడ్ అవుట్ అవుతూ ఉంటారు. ఇక తమ మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ లలో ప్రియాంక జవాల్కర్ కూడా ఒకరు.

ప్రియాంక జవాల్కర్.. టాక్సీవాలా సినిమాతో టాలీవుడ్‌‌‌‌‌లో అడుగుపెట్టిన తెలుగు బ్యూటీ. రౌడీ హీరో విజయ్ దేవరకొండ పక్కన ఆమె నటించింది. ఈ మూవీ మీద ఎంతో అంచనాలు ఉన్నా కూడా ఎందుకో చతికిలపడింది. దాంతో ఆమెకు చాన్సులు లేకుండా పోయాయి. అయితే నిరాశపడలేదు. గట్టిగా ప్రయ్త్నించింది. ఇటీవల స్పీడ్ పెంచిన ఈ అమ్మడు తిమ్మరుసు ఎస్ఆర్ కళ్యాణ మండపం సినిమాలతో వరుస హిట్స్ అందుకుంది.ఈ రెండు చిత్రాల్లో ప్రియాంక అందం, నటన ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. నార్త్‌ హీరోయిన్ల హవా కొనసాగుతున్న సమయంలో వారికి గట్టి పోటీ ఇస్తూ వరుస సినిమాలతో దూసుకెళ్తుంది ఈ అచ్చ తెలుగు భామ.

తిమ్మరుసు ఎస్ఆర్ కళ్యాణ మండపం సినిమాలల్లో ప్రియాంక ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. రెండు వరుస సినిమాల నేపథ్యంలో మీడియాతో మాట్లాడుతూ.. అల్లు అర్జున్‌ అంటే క్రష్‌ అని తన మనసులోని మాటలను బయటపెట్టింది. టాక్సీవాలా సినిమా తరువాత సెలెక్టెడ్ గా స్క్రిప్ట్స్ ఎంచుకొని మూవీస్ సైన్ చేస్తున్నాను అని చెప్పిన ఈ భామ తన పై నెగిటీవ్ కామెంట్స్ ను లైట్ తీసుకుంటాను అంటుంది. ఇక ఆమె తదుపరి ప్రాజెక్ట్స్ గురించి మాట్లాడుతూ..ఇలాంటి పాత్రలే చెయ్యాలని లేదని.. ఆమెకు నచ్చిన ఏ పాత్ర నైనా చేస్తాను అంటుంది. అసలు ముందు తను సినిమా చేయాలంటే కథ.. కథ ఖచ్చితంగా నచ్చాలి అంట. కథ నచ్చితే ఆ పాత్రకు కమిట్ అయిపోత..అది ఎలాంటి పాత్రైన లెక్క చేయను అంటూ చెప్పుకొచ్చింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news