టాలీవుడ్లో కమెడియన్‌గా ఎంట్రీ ఇచ్చిన బండ్ల గణేష్ దశాబ్దంన్నర పాటు సినిమాల్లో చిన్నా చితకా పాత్రలు వేసుకునేవాడు. అప్పట్లో బండ్ల గణేష్ అంటే పెద్దగా ఎవ్వరికి తెలిసేది కాదు. అలాంటి బండ్ల ఉన్నట్టుండి వరుస పెట్టి స్టార్ హీరోలతో సినిమాలు చేసుకుంటూ పోయాడు. దీంతో ఒక్కసారిగా బండ్ల గణేష్ అంటే బడా ప్రొడ్యుసర్ అనే రేంజ్‌కు ఎదిగిపోయాడు. గత కొంత కాలంగా సైలెంట్‌గా ఉంటోన్న బండ్ల గతేడాది సరిలేరు నీకెవ్వరు సినిమాలో చిన్న పాత్ర చేశాడు.
ఇక ఇప్పుడు మళ్లీ ఛాన్స్ ఉంటే పెద్ద హీరోలతో సినిమాలు చేసేందుకు రెడీ అవుతున్నాడు. పరమేశ్వర ఆర్ట్స్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై పవన్ కళ్యాణ్ – ఎన్టీఆర్ – రవితేజ – అల్లు అర్జున్ – రామ్‌చరణ్ లాంటి స్టార్లతో వరుస పెట్టి సినిమాలు చేశాడు. ఎంతో బిజీ ప్రొడ్యుసర్‌గా ఉండే బండ్ల గణేష్ 2015లో ఎన్టీఆర్‌తో టెంపర్ సినిమా తీశాక మళ్లీ సినిమా చేయలేదు. టెంపర్ సినిమా షూటింగ్ టైంలో ఎన్టీఆర్‌కు బండ్లకు మధ్య విబేధాలు వచ్చాయన్న ప్రచారం జరిగింది.
ఆ తర్వాత పలు టీవీ ఛానెల్స్ ఇంటర్వ్యూలలో ఎన్టీఆర్ పేరెత్తితేనే బండ్ల కంగారుగా అనేక సందేహాలకు తావిచ్చేలా మాట్లాడేవారు. అయితే ఓ ప్రముఖ ఛానెల్ ఇంటర్వ్యూలో తాను ఎన్టీఆర్ విషయంలో మిస్ కమ్యూనికేషన్ వల్ల పొరపాటు పడ్డానని.. ఎన్టీఆర్ అభిమానులకు సారీ చెపుతున్నానని చెప్పారు. ఇక మరోసారి ఎన్టీఆర్‌తో విబేధాల వార్తలపై క్లారిటీ ఇచ్చారు.
భార్యభర్తలు, అన్నదమ్ముల మధ్య చిన్న చిన్న గ్యాప్ ఉంటుందని… ఎన్టీఆర్‌తో ఓ మిస్ కమ్యూనికేషన్ వల్ల చిన్న డిస్కర్షన్ జరిగిందని చెప్పుకొచ్చాడు. అంతేకాని తమ ఇద్దరి మధ్య ఏం గొడవలు లేవని మరోసారి చెప్పేశాడు. ఇక గత ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌లో చేరిన బండ్ల రాజకీయంగా కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకునే పనిలో బిజీగా ఉన్నాడు. ఇక ఇటీవలే తన కులం కమ్మ కులం అని కూడా బయట పెట్టుకున్నాడు