దిగ్గజ దర్శకుడిగా.. ఎన్నో క్లాసికల్ చిత్రాలను తెరకెక్కించిన ఘనత కేవలం మణిరత్నం కే దక్కింది అని చెప్పవచ్చు. ఒకటా , రెండా .. కొన్ని పదుల సంఖ్యలో క్లాసికల్ చిత్రాలను అందించిన నేర్పరి. దేశవ్యాప్తంగా ఒక గొప్ప సంగీత దర్శకుడిగా గుర్తింపు పొందిన ఈయన, ప్రస్తుతం ఈయన చేసే చాలా సినిమాలు పెద్దగా ఆడలేదు.. అలాగని యావరేజ్ గా కూడా మిగలలేదు.. అప్పట్లో అంతటి మంచి స్టార్ డైరెక్టర్ గా పేరు సంపాదించుకున్న మణిరత్నం, ఇప్పుడు ఎందుకు అన్ని ఫ్లాపులను చేస్తున్నాడు.. అంటూ సోషల్ మీడియాలో గత కొద్దిరోజుల నుంచి జోరుగా వార్తలు వినిపిస్తున్నాయి..
మణిరత్నం సినీ ఇండస్ట్రీకి సంబంధించిన 24 క్రాఫ్ట్స్ బాగా తెలిసిన వ్యక్తి. సినిమారంగంలో ఆయనకు ఎవరూ సాటి రారు అని చెప్పవచ్చు. విజువల్ డైరెక్టర్ గా శంకర్ అలాగే రాజమౌళి కూడా ఈమధ్య సత్తా చాటుతున్నారు. కానీ గత 30 సంవత్సరాలుగా మణిరత్నం తన లో ఉన్న ప్రతిభను కనబరుస్తున్నారు. తన 30 సంవత్సరాల కెరియర్లో జయాపజయాలను ఎదుర్కొన్న మణిరత్నం వాటి నుంచి బయట పడడం లేదు..
ఇకపోతే 1980 లో తన సోదరుడు జీవి కూడా ఒక క్రిటిక్ గా పని చేసేవాడు. జీవి చార్టెడ్ అకౌంటెంట్. అలాగే కమర్షియల్ అంశాల గురించి బాగా తెలిసిన వ్యక్తి. ఇక సినిమా వ్యాపారంలో కూడా ఆయనలాగా ఎవరు బిజినెస్ చేయలేరేమో. ముఖ్యంగా డిస్ట్రిబ్యూషన్, ఫైనాన్స్ తీసుకురావడం, ప్రొడక్షన్స్ లాంటి ఎన్నో పనులను విజయవంతంగా పూర్తి చేసేవాడు. జీవి, మణిరత్నం ఇద్దరు కలిసి పనిచేసిన ఎన్నో సినిమాలు కూడా విజయవంతం అవడం గమనార్హం. అనుకోకుండా అన్నదమ్ముల మధ్య గొడవలు రావడం, మనస్తాపానికి చెందిన జీవి ఆత్మహత్య చేసుకోవడం జరిగింది.
ఇక అక్కడితో మణిరత్నం కెరియర్ కూడా స్పాయిల్ అయిందని చెప్పవచ్చు. రాజమౌళికి తను తీసిన సినిమాలు ఎక్కడ ఆడితే, తనకు లాభం వస్తుందో అని ట్రిక్స్ బాగా తెలుసు. కానీ మణిరత్నం విషయంలో మాత్రం ఇది చాలా తక్కువనే చెప్పవచ్చు. ఎందుకంటే ఆయన సినిమాలు తీస్తాడు కానీ ప్రమోషన్స్ విషయంలో వెనుకంజలో ఉంటాడు. అందుకే ఈ మధ్య మణిరత్నం సినిమాలు హిట్ కాలేకపోతున్నాయి.