Moviesటాప్ హీరోయిన్ - డైరెక్ట‌ర్ దంపతులు ఆ ప‌ని చేయ‌డానికి కార‌ణం...

టాప్ హీరోయిన్ – డైరెక్ట‌ర్ దంపతులు ఆ ప‌ని చేయ‌డానికి కార‌ణం ?

తెలుగు సినీ ఇండస్ట్రీలో కొంతమందికి కొన్ని ప్రత్యేకమైన స్థానాలు ఉంటాయనడంలో ఎలాంటి సందేహం లేదు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అడుగు పెట్టిన సీత గురించి కూడా తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. హీరోలకు తల్లి పాత్రలో, విలన్ లకు భార్య పాత్రలో కూడా నటించి అందరినీ మెప్పించింది. ఇకపోతే తమిళ ప్రముఖ దర్శకుడు అలాగే నటుడు అయిన పార్తీపన్ ను 1990వ సంవత్సరంలో వివాహం చేసుకుంది. కొన్ని అనుకోని కారణాల చేత 2001వ సంవత్సరంలో వీరిద్దరు విడిపోయారు .

సుమారుగా 11 సంవత్సరాల పాటు కొనసాగిన వీరి వైవాహిక జీవితంలో కలతలు రావడంతో విడాకులు తీసుకున్నట్లు తెలుస్తోంది. నాటి నుంచి నేటి వరకు పార్థివన్ పెళ్లి చేసుకోకుండా ఒంటరి జీవితాన్ని గడుపుతున్న విషయం తెలిసిందే. సీత మాత్రం 2010వ సంవత్సరంలో టీవీ నటుడు అయిన సతీష్ ను రెండో వివాహం చేసుకుంది. అయితే ఈ బంధం కూడా మూడునాళ్ళ ముచ్చట లాగే మిగిలిపోయింది. 2016 సంవత్సరం లో సతీష్ నుంచి సీత విడిపోవడం జరిగింది..

ఇకపోతే అసలు విషయానికొస్తే , 1989వ సంవత్సరంలో పుదియ పాదై సినిమా ద్వారా దర్శకుడిగా పరిచయం అయ్యాడు పార్తీపన్. అనాధ పిల్లలు ఎలాంటి అవస్థలు పడతారో చక్కగా తెలియజేశారు ఈ చిత్రంలో. ఆ విధంగా ఈ సినిమా విజయోత్సవం కూడా పూర్తి చేసుకుంది. అయితే ఆయన ఈ సినిమా విజయోత్సవ సభలో ఈ సినిమాలో లాగే నేను కూడా ఒక అనాధ పిల్లలను దత్తత తీసుకుంటానని చెప్పాడు. సీతతో వివాహమయ్యాక వీరికి ఇద్దరు పిల్లలు కూడా పుట్టారు. ఒకరు కీర్తన , మరొకరు అభినయ.

సీత‌ అనుమతితోనే పార్తీపన్ ఒక అనాధ అబ్బాయిని దత్తత తీసుకొని , అతడికి రాధాకృష్ణన్ అనే పేరు కూడా పెట్టాడు. ఆర్థికంగా మెరుగుపడిన కుటుంబాలు ఇలా అనాధ పిల్లలను దత్తత తీసుకోవాలని ఆయన జనాలను కోరాడు.. పిల్లలు కూడా చేయని తప్పుకు మేం ఎందుకు ఇబ్బందులు పడాలని , బాధపడకూడదు అని ఈ పిల్లాడికి చెన్నై లోని మ్యూజియం థియేటర్లో నామకరణ మహోత్సవాన్ని అత్యంత భారీ స్థాయిలో నిర్వహించాడు పార్తీపన్.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news