చిన్న వయసులోనే సినిమాల్లో నటించే అవకాశం కొట్టేసిన హన్సిక తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకుంది. అందం, అభినయం, అమాయకత్వం అన్ని కలగలిపితే హన్సిక అనడంలో సందేహమే లేదు. దేశముదురు సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చిన బొద్దు గుమ్మ హన్సిక, ఆ తరువాత వరుసబెట్టి సినిమాలు చేస్తూ వచ్చింది.
కొంత కాలానికి తెలుగులో ఫేడ్ అవుట్ అయిన ఈ బొద్దు బ్యూటీ తమిళంలో మాత్రం తన స్టార్‌డమ్‌ను కొనసాగిస్తూనే ఉంది. బబ్లీ బ్యూటీ హన్సిక ప్రస్తుతం సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తూ వస్తోంది. తమిళంలో ఈ పాప అదిరిపోయే ఆఫర్లతో రచ్చ చేస్తోంది. ఇదిలా ఉంటే ప్రస్తుతం హన్సిక ‘105 మినిట్స్’ అనే సినిమాలో నటిస్తోంది. రాజు దుస్సా ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా మొత్తం ఒకే ఒక్క క్యారెక్టర్ తో నడుస్తుంది.
అయితే ఈ సినిమా నిర్మాణాంతర కార్యక్రమాలు పూర్తి చేసుకొని విడుదలకు సిద్దమైన సందర్భంగా హన్సిక మాట్లాడుతూ.. “ఇప్పటివరకూ నేను చేసిన సినిమాలన్నిటిలో కంటే ఇది చాలా టఫ్‌గా అనిపించింది. కథను చెప్పినట్లుగానే దర్శకుడు ఈ సినిమాను చాలా అద్భుతంగా తెరకెక్కించాడు. అందరం చాలా కష్టపడి చేసిన ఈ సినిమా విజయవంతం కావాలని కోరుకుంటున్నాము” అని తెలిపింది.
ఈ సందర్భంగా దర్శకుడు రాజు దుస్సా మాట్లాడుతూ ..ఈ సినిమాలో ప్రతి షాట్ 20 నుంచి 25 నిమిషాల పాటు ఉంటుంది అని..సింగిల్ షాట్‌ని హన్సిక సింగిల్ టేక్‌లో చేశారని, అందువల్లే ఈ సినిమాను కేవలం ఆరు రోజుల్లోనే పూర్తి చేయగలిగాం అని దర్శకుడు రాజు దుస్సా అన్నారు. ఇక ఈ సినిమాలో హన్సిక యక్టింగ్ చూసి..డైరెక్టర్ మైండ్ బ్లాక్ అయ్యిందట. ఇది వరకు ఎప్పుడు చూడని హన్సిక ఈ సినిమాలో చూపిస్తున్నారట.