మెగాస్టార్ చిరంజీవి.. యంగ్ హీరోలతో పోటీ పడుతూ.. ఆరు పదుల వయసులో కూడా ఏ మాత్రం క్రేజ్ తగ్గకుండా దూసుకుపోతున్నాడు. ఈయన కుర్ర హీరోలలాగే ఒకే సంవత్సరంలో మూడు నుంచి నాలుగు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ, తనదైన శైలిలో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. ఇప్పటికే కొరటాల శివ డైరెక్షన్ లో ఆచార్య షూటింగ్ పూర్తి చేశాడు. ప్రస్తుతం కోలీవుడ్ డైరెక్టర్ మోహన్ రాజాతో లూసిఫర్ రీమేక్ షూటింగ్ తో బిజీగా అయిపోయాడు.
అయితే ఈ సినిమా తరువాత మెగాస్టార్ చిరంజీవి తమిళ ‘వేదాళం’ చిత్రాన్ని కూడా రీమేక్ చేయనున్న సంగతి తెలిసిందే. దీంతో పాటు దర్శకులు బాబీ, మెహర్ రమేష్‌తో చిరంజీవి కమిటైన సినిమాల తాలూకు అప్‌డేట్స్ ఆయన పుట్టినరోజు సంధర్భంగా ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది.
తాజా సమాచారం ప్రకారం మెగాస్టార్ చిరంజీవి కోసం మారుతి ఏకంగా మూడు కథలు రాసుకున్నాడట. ఈ మధ్యనే ఆ మూడు కథలను వినిపించగా చిరంజీవి అందులో ఒక కథకు ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. మారుతి చెప్పిన స్టోరీ లైన్ కు ఇంప్రెస్ అయిన చిరు స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేసిన తర్వాత మరోసారి తనను కలువాలని చెప్పాడట.
మెగాస్టార్ చిరంజీవిని డైరెక్ట్ చేయాలన్న కల నెరవేరే సమయం రానుండటంతో..చిరు సూచన మేరకు పర్ ఫెక్ట్ కథను సిద్దం చేసే పనిపై ఫోకస్ పెట్టాడని ఫిలింనగర్ లో చర్చలు నడుస్తున్నాయి. అన్నీ అనుకున్నట్టుగానే జరిగితే గీతా ఆర్ట్స్ బ్యానర్ ఈ సినిమాను స్వయంగా నిర్మించనుంది. అయితే దీని గురించి అధికారిక ప్రకటన ఇంకా బయటకు రావాల్సి ఉంది.