సినీ ఇండస్ట్రీలో ఒక్కక్కరుగా పెళ్లీ పీఠలు ఎక్కుతున్నారు. హీరో, హీరోయిన్లు, నిర్మాతలు, దర్శకులు అందరు మాంగళ్యం తంతునానేనా అనిపిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా మరో స్టార్ హీరోయిన్ నయనతార కూడా పెల్లి పీఠలు ఎక్కబోతున్నట్లు తెలుస్తుంది. సౌత్ లో స్టార్ హీరోయిన్ గా అంచెలంచలుగా ఎదుగుతూ వస్తున్న భామ నయనతార కోలీవుడ్ లో ఆమె సినిమా అంటే అక్కడ స్టర్ హీరోలు కూడా భయపడే పరిస్థితి ఉంది. కంటెంట్ ఉన్న సినిమాలతో తమిళనాట సంచలన విజయాలను అందుకుంటున్న నయనతార ప్రస్తుతం ఫుల్ ఫాంలో ఉందని చెప్పొచ్చు. ఏ హీరోయిన్ కూడా చేయని ప్రయోగాలతో నయన్ సినిమాలు చేస్తుంది. ఇక తెలుగులో కూడా సీనియర్ స్టార్స్ కు ఆమె బెటర్ ఆప్షన్ అయ్యింది. అందుకే ఇక్కడ అక్కడ వరుస సినిమాలు చేస్తూ బిజీ బిజీగా ఉంది అమ్మడు.
అయితే పెళ్లి ప్రస్థావన తెస్తే మాత్రం మాట దాటవేస్తుంది. విఘ్నేష్ శివన్ తో కొన్నాళ్లుగా డేటింగ్ లో ఉన్న నయనతార పెళ్లెప్పుడు అంటే మాత్రం నోరు విప్పదు. కానీ తాజాగా జరిగిన్ ఐంటర్వ్యుల్లో నయనతార తన పెళ్లి గురిచి క్లారిటీ ఇచ్చిన్నట్లు తెలుస్తుంది. నయనతార నేత్రికన్ సినిమా డిస్నీ + హాట్ స్టార్ ఓటీటీ లో డైరెక్టర్ రిలీజ్ కాబోతుంది.ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా తమిళ ప్రముఖ ఛానెల్ విజయ్ టీవీకి ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఈమె క్లారిటీ ఇచ్చింది. విఘ్నేష్ శివన్ తో పెళ్లి విషయమై ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. దర్శకుడు విఘ్నేశ్‌తో తనకు నిశ్చితార్థం జరిగిందని ఎంతో హ్యాపీగా చెప్పింది. అలానే మేము ఇద్దరం అతి త్వరలోనే వివాహం చేసుకుంటున్నాం అని ఆమె అన్నారు.
కొన్ని నెలల క్రితం విఘ్నేష్ శివన్ ఓ ఫొటోను షేర్ చేస్తూ… జీవితం కోసం చేతి వేళ్లు కలిశాయి అంటూ కామెంట్ పెట్టాడు. దాంతో ఇద్దరికి కూడా ఎంగేజ్ మెంట్ అయ్యిందని ప్రచారం జరిగింది. కాని ఈ జంట అసలు బయటపడలేదు. ఏది ఏమైతేనేం ఎట్టకేలకు లేడీ సూపర్ స్టార్ తనకు ఎంగేజ్ మెంట్ అయ్యిందని.. ఇది ఎంగేజ్ మెంట్ రింగే అంటూ తన చేతి వేలికి ఉన్న రింగ్ ను చూపించేసింది.