Moviesమహేష్ నమ్రత ల పెళ్లి ఆమె కి ఇష్టమే లేదు.. కానీ...

మహేష్ నమ్రత ల పెళ్లి ఆమె కి ఇష్టమే లేదు.. కానీ ఎందుకు ఒప్పుకుందో తెలుసా..??

సూపర్ స్టార్ మహేష్ బాబు.. యమ జోరు మీద ఉన్నాడు. గతేడాది అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన సరిలేరు నీకెవ్వరూ సినిమాతో నాన్ బాహుబలి ఇండస్ట్రీ అందుకున్నాడు. ఇక ఆ తరువాత..ఆ సినిమా మంచి మాస్ హిట్ అందుకోవడంతో సూపర్ స్టార్ తదుపరి సినిమా అయిన సర్కారు వారి పాట మీద భారీ అంచనాలు పెరిగాయి.

సూపర్ స్టార్ మహేష్ తో యువ దర్శకుడు పరశురామ్ పెట్ల తీస్తున్న లేటెస్ట్ సెన్సేషనల్ మూవీ సర్కారు వారి పాట. ఇక్కడ మరో షాకింగ్ ఏమిటంటే..మహేష్ బాబు ఇప్పటివరకు తన కెరీర్ లో ఊహించని..పోషించని ఒక విభిన్న పాత్రతీ ఈ సినిమాలో కనిపించనున్నారు. ఇక ఈ సినిమాలో ఆయనకు జోడీగా హాట్ బ్యూటీ కీర్తి సురేష్ నటిస్తుండగా థమన్ అధ్బుతమైన సంగీతాన్ని అందిస్తున్నారు. మహేష్ ప్రస్తుతం సర్కారు వారి పాట సినిమా షూటింగ్‌లో బిజీగా బిజీగా ఉన్నారు. అయితే మహేష్ బాబు రీసెంట్ గా తన బర్త డే జరుపుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆయన గురించి పలు ఇంట్రెస్టింగ్ విషయాలు బయటకి వస్తున్నాయి.

టాలీవుడ్‌లో క్యూట్ క‌పుల్స్‌లో మ‌హేష్ బాబు-న‌మ్ర‌త శిరోద్క‌ర్ జోడీ కూడా ఒక‌టి. ఎవరైన సరే ఈ జంటను చూస్తే మేడ్ ఫర్ ఈచ్ అదర్ అని అనాల్సిందే.. అలా ఉంటుంది ఈ జంట. అయితే ఈ జంట ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం మనకు తెలిసిందే. అయితే వీళ్ళ పెళ్ళికి ఫస్ట్ నమ్రత ఫ్యామిలీ వాళ్లు ఒప్పుకోలేదట. కానీ మహేష్ బాబు చూసాక.. ఎలాగోలా పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట.

ఇక్కడ షాకింగ్ ఏమిటంటే..మహేష్ బాబు నమ్రత ల పెళ్లికి సూపర్ స్టార్ కృష్ణ కూడా ఒప్పుకోలేదట. ఎందుకంటే న‌మ్ర‌త‌ ముంబై హీరోయిన్ కావ‌డం ఒక రీజన్ అయితే..వాళ్ళ సాంప్ర‌దాయాలు కూడా వేరేగా ఉంటాయి అనే కారణాల వల్ల నో చెప్పారట. మ‌రోవైపు మ‌హేశ్ అమ్మ‌మ్మ‌ దుర్గమ్మ కూడా వీళ్ల పెళ్లికి అసలు ఒప్పుకోలేదట. ఈ పెళ్ళి అంటే త‌న‌కు అస్సలు ఇష్టం లేదు అని నానా హంగామా చేశారట‌. కానీ చివరికి మహేష్ బాబు అక్కలు మరియు బావలు కలిసి కృష్ణ ను మహేష్ అమ్మమ్మ ను ఒప్పించి పెళ్లి చేశారట.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news