స్టైలీష్‌స్టార్ అల్లు అర్జున్ క్రేజ్ ఇప్పుడు మామూలుగా లేదు. గతేడాది సంక్రాంతికి అల వైకుంఠపురములో లాంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్న అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో పుష్ప సినిమాలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. గతంలో సుకుమార్ – బన్నీ కాంబినేషన్లో వచ్చిన ఆర్య, ఆర్య 2 సినిమాలు సక్సెస్ అవ్వడంతో ఇప్పుడు పుష్పపై సైతం అవే అంచనాలు ఉన్నాయి. పుష్ప పార్ట్ 1ను ఈ యేడాది క్రిస్మస్కు థియేటర్లలోకి తీసుకు వచ్చేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఇందులో బన్నీ సరసన రష్మిక మందన్న హీరోయిన్.
ఇదిలా ఉంటే అల్లు అర్జున్ – యాంగ్రీ యంగ్‌మెన్ రాజశేఖర్ కాంబినేషన్ అంటే ఎలా ? ఉంటుందో ? ఊహించుకోండి. పెద్ద సంచలనమే..! అయితే గతంలో వీరి కాంబినేషన్లో రావాల్సిన ఓ సినిమా మిస్ అయ్యింది. అదేదో కాదు సన్నాఫ్ సత్యమూర్తి. ఈ సినిమాలో కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర అదిరిపోయే క్యారెక్టర్ వేశాడు. ఈ కథ రాసుకున్నప్పుడే ఈ క్యారెక్టర్ కోసం దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఉపేంద్ర క్యారెక్టర్‌ను రాజశేఖర్‌తో చేయాలని అనుకున్నారట.
అయితే తర్వాత ఏమైందో గాని రాజశేఖర్‌ను అనుకుంటే ఈ ప్లేసులోకి ఉపేంద్ర వచ్చాడు. బన్నీకి కన్నడంలో కూడా మంచి మార్కెట్ తెచ్చేందుకు.. అక్కడ మార్కెట్ కోసమే ఉపేంద్రను తీసుకున్నారని తర్వాత ప్రచారం జరిగింది. అలా రాజశేఖర్ – బన్నీ కాంబినేషన్లో రావాల్సిన ఓ సినిమా మిస్ అయ్యింది. తర్వాత దీనిపై రాజశేఖర్ మాట్లాడుతూ ఈ క్యారెక్టర్ నాకు వస్తే ఖచ్చితంగా అందులో నటించి ఉండేవాడిని అని చెప్పారు.