గత కొన్ని రోజులుగా లీకుల తో అల్లాడిపోతున్న పుష్ప టీం కు ఇది కొచెం రిలాక్స్ నిచ్చే విషయం అనే చెప్పాలి. తాజాగా ఈ సినిమా నుంచి విడుదల అయిన ఫస్ట్ సింగిల్ ‘దాక్కో దాక్కో మేక’ అంటూ సాగే ఈ పాట రికార్డ్ సృష్టించింది. విడుదలైన అన్ని భాషల్లో కలిపి లక్షకు పైగా లైక్స్ ను దక్కించుకున్న ఏకైక పాటగా ఇది నిలిచింది.
బన్నీ – సుకుమార్ కాంబినేషన్లో వస్తోన్న పుష్పపై భారీ అంచనాలు ఉన్నాయి. రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమాలో ఫహద్ ఫాజిల్ విలన్ గా కనిపించనున్నారు. ఈ సినిమా విడుదలకు ముందే టీజర్,సాంగ్ ఇంకా పోస్టర్ లతో పాన్ ఇండియా రేంజ్ లో పెద్ద హైప్ క్రియేట్ చేసి దూసుకు పోతుంది. ఇక అల్లు అర్జున్ పుష్ప సినిమా నుంచి బయటకు వచ్చిన ఫస్ట్ సింగిల్ దాక్కో దాక్కో మేక .ఆగస్ట్ 13 ఉదయం విడుదలైన ఈ పాట నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. అలా దాక్కో దాక్కో మేక అనే పాట ఇప్పుడు యూట్యూబ్‌లో ట్రెండ్ అవుతోంది.
పాన్ ఇండియా ప్రాజెక్టుగా విడుదల అవుతున్న ఈ సినిమాలో ఈ పాటను కూడా ఐదు భాషల్లో ఐదుగురు సింగర్లతో పాడించారు.. సంగీత దర్శకుడు దేవీ శ్రీ ప్రసాద్. తెలుగు భాషలో అత్యధిక వ్యూస్ ను అతి తక్కువ సమయంలో దక్కించుకున్న పాటగా పుష్ప ఫస్ట్ సింగిల్ రికార్డు క్రియేట్ చేసిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ పాట మరో రికార్డు సాధించింది. తెలుగుతో పాటు ఇతర భాషల్లో కలిపి లక్షకు పైగా లైక్స్ ను దక్కించుకున్న ఏకైక పాటగా ఇది నిలిచింది. ఇక ఈ రికార్డుకి అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తెలుగు తో పాటు హిందీ, కన్నడం, తమిళం ఇంకా మలయాళం భాషల్లో విడుదల అయిన పుష్ప పాట కు అన్ని భాషల్లో కూడా మంచి స్పందన వచ్చినందుకు పుష్ప టీం ఫుల్ ఖుషీ ఖుషీ గా ఉంది.