ప్రభాస్.. ఆరు అడుగుల అందగాడు. డార్లింగ్ ప్రభాస్ వ్యక్తిత్వం గురించి మనందరికీ తెలిసిందే. స్టార్ హీరోగా ఎదిగిన ఇప్పటికీ సింప్లిసిటీని మెయింటెన్ చేస్తుంటాడు. అంతేకాదు సెట్‌లో నటీనటులతోపాటు టెక్నీషియన్స్‌తోనూ డార్లింగ్ సరదాగా ఉంటాడు. దీంతో అందరు ప్రభాస్ మనస్సు బంగారం అని చెబుతుంటారు. గోదావరి వంటకాలు ప్రభాస్ వారింట్లో ఫేమస్. అప్పుడప్పుడూ షూటింగ్‌లో ఉన్న వారికి తమ ఇంటి రుచులు చూపిస్తుంటారాయన. అలాగే వారికి నచ్చిన ఫుడ్ ఐటెమ్స్‌ను పార్శిల్స్ రూపంలోనూ పంపుతుంటారు.
ప్రభాస్ తో పని చేసే నటీనటులు ప్రభాస్ తిండి పెట్టి చంపేస్తాడని చెబుతుంటారు. ముఖ్య నటీనటులకు ప్రభాస్ ఇంటి నుంచి క్యారియర్లు వెళుతుంటాయని రకరకాల వంటకాలను చేయించి ప్రభాస్ సర్ ప్రైజ్ అయ్యేలా చేస్తుంటారని ప్రభాస్ సినిమాల్లో నటించే నటీనటులు అంటుంటారు. ఇటీవలే ప్రభాస్ టెస్టీ ఫుడ్ గురించి సీనియర్ నటి నదియా చెప్పుకొచ్చిన సంగతి తెలిసిందే.
తాజాగా సలార్ బ్యూటీ శ్రుతి హాసన్ కూడా నదియా సరసన చేరిపోయారు. ఈసారి సలార్ బ్యూటీ శ్రుతిహాసన్ కోసం దాదాపు 20 వెరైటీ వంటకాలతో సర్‌ప్రైజ్ ఇచ్చారు. ఆంధ్రా స్టైల్ లో అన్ని రకాల నాన్ వెజ్ ఐటమ్స్ ని ప్రభాస్ తన చెఫ్ నుంచి తయారు చేయించి శ్రుతిహాసన్ కి సెట్స్ లో వడ్డించారట.
ప్రస్తుతం ప్రభాస్, శృతిహాసన్ హీరోహీరోయిన్లుగా సలార్ మూవీ చిత్రీకరణ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా శ్రుతి హాసన్ కోసం స్పెషల్‌గా చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, గోంగూర మాంసం, కబాబ్, రకరకాల పప్పులు, సాంబార్, కర్రీ సహా దాదాపు ఇరవై రకాల వంటకాలను ప్రభాస్ వండించి తీసుకొచ్చారట.
ఈ మేరకు ప్రతీ ఒక్క వంటకం గురించి శ్రుతీ హాసన్ చెప్పుకొచ్చారు. చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, గోంగూర మాంసం, కబాబ్, రకరకాల పప్పులు, సాంబార్, కర్రీలు ఇలా తెచ్చిన వెరైటీ వంటకాలన్నింటిని చూపించారు.
ఈ విషయాని ఆమె ఓ వీడియో ద్వారా తెలిపింది. ఆ వీడియోలో మాట్లాడుతూ..నాన్ వెజ్ లో ఇన్నిరకాలు ఎప్పుడూ రుచి చూడలేదని..ప్రభాస్ అత్యంత పురాతన వంటకాలు తినే పురాతన మానవుడని అభివర్ణించి.. ప్రభాస్ తనపై చూపించిన ఈ ప్రేమని ఎప్పటికీ మర్చిపోలేనని శ్రుతి హాసన్ తెలిపింది.ప్రస్తుతం ఈ వంటకాలకు సంబంధించిన లిస్ట్, వీడియోను చూస్తే ఎవ్వరైనా సరే షాక్ అవ్వాల్సిందే.