Moviesమేకప్ లేకుండా డిఫరెంట్ లుక్‌లో నమ్రత..మహేష్ బాబు ఏమన్నాడో తెలుసా..??

మేకప్ లేకుండా డిఫరెంట్ లుక్‌లో నమ్రత..మహేష్ బాబు ఏమన్నాడో తెలుసా..??

టాలీవుడ్‌లో క్యూట్ క‌పుల్స్‌లో మ‌హేష్ బాబు-న‌మ్ర‌త శిరోద్క‌ర్ జోడీ కూడా ఒక‌టి. ఎవరైన సరే ఈ జంటను చూస్తే మేడ్ ఫర్ ఈచ్ అదర్ అని అనాల్సిందే.. అలా ఉంటుంది ఈ జంట. అయితే ఈ జంట ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం మనకు తెలిసిందే. వంశీ సినిమా షూటింగ్ టైంలో ప్రేమలో పడ్డ ఈ జంట..ఆ తరువాత కొంత కాలం గుట్టుచప్పుడు కాకుండా సీక్రెట్ గా ప్రేమించుకుని.. పెద్దలు కు చెప్పారు.అయితే వీళ్ళ పెళ్ళికి ఫస్ట్ నమ్రత ఫ్యామిలీ వాళ్లు ఒప్పుకోలేదట. కానీ మహేష్ బాబు చూసాక.. ఎలాగోలా పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. ఇక..లాస్ట్ కి అందరిని ఒప్పించుకుని ఈ జంట ఒకటైంది. వీళ్లకి ఓ పాప..బాబు కూడా ఉన్నరు. ఎంతో హ్యాపీగా లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్నారు ఈ ఫ్యామిలీ.

నమ్రత శిరోద్కర్ సోషల్ మీడియాలో యమ యాక్టివ్ గా ఉంటరు. ఎప్పటికప్పుడు తన గురించి..తన భర్త ..పిల్లలు గురించి సబంధించిన అప్డేట్స్ పోస్ట్ చేస్తుంటారు. ఈ క్రమంలోనే తాజాగా మేకప్ లేకుండా తన లేటెస్ట్ లుక్ షేర్ చేసి షాకిచ్చింది నమ్రత. ఈ ఫోటోలో నమ్రత ఎప్పుడు లేనివిధంగా డిఫరెంట్ లుక్‌లో కనిపించడంతో ఈ ఫోటో నెట్టింట వైరల్ అవుతోంది. ఇక ఈ ఫోటో చూసి మహేష్ బాబు కూడా కామెంట్ చేసాడండోయ్.

ప్రముఖ సెలబ్రిటీ ఫోటోగ్రాఫర్ అవినాష్ గోవారికర్, ఇటీవల గోవాలో జరిగిన ‘సర్కారు వారి పాట’ షెడ్యూల్‌లో కూడా నమ్రత శిరోద్కర్‌ని ప్రత్యేకంగా కొన్ని ఫొటోస్ తీశారు. ఇక నమ్రత ఆ ఫొటోని తన ఇన్స్‌స్టా పేజీలో షేర్ చేస్తూ.. ” ఏదో సరదాగా మహేష్ జాకెట్ తీసుకుని మేకప్ లేకుండా దిగిన ఈ ఫోటోలను ఇంత బాగా మీరు క్యాప్చర్ చేస్తారని ఊహించలేదు బ్రదర్” అని పోస్ట్ చేసింది. ఈ ఫొటోస్ చూసిన మహేష్ బాబు ‘పర్ఫెక్ట్ పిక్’ అంటూ స్వీట్ కామెంట్ చేయడం విశేషం. ప్రస్తుతం సోషల్ మీడియాలో నమ్రత లేటెస్ట్ లుక్ తెగ చక్కర్లు కొడుతోంది. అయితే ప్రస్తుతం మహేష్ బాబు సర్కారు వారి పాట అనే సినిమా షూటింగ్ లో బిజీ బిజీ గా ఉన్న సంగతి తెలిసిందే.

 

 

 

 

View this post on Instagram

 

A post shared by Namrata Shirodkar (@namratashirodkar)

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news