Moviesఆ స్టార్ హీరోయిన్‌తో నాగార్జున పెళ్లి ప్ర‌పోజ‌ల్‌... నాడు ఏం జ‌రిగింది...

ఆ స్టార్ హీరోయిన్‌తో నాగార్జున పెళ్లి ప్ర‌పోజ‌ల్‌… నాడు ఏం జ‌రిగింది ?

టాలీవుడ్ కింగ్ నాగార్జున సినిమాల్లోకి వ‌చ్చిన తొలినాళ్లలోనే అమ్మాయిల క‌ల‌ల రాకుమారుడు. శివ త‌ర్వాత నాగార్జున‌కు యూత్‌లో అదిరిపోయే ఇమేజ్ వ‌చ్చింది. నిన్నే పెళ్లాడ‌తా సినిమా నుంచి నాగార్జున‌కు అమ్మాయిల్లో అదిరిపోయే ఫాలోయింగ్ ఉంది. మ‌న్మ‌థుడుతో అమ్మాయిల గుండెల్లో ఓ రొమాంటిక్ హీరో అయిపోయాడు. ఇక నాగార్జున వ్య‌క్తిగ‌త జీవితం విష‌యానికి వ‌స్తే ముందుగా లెజెండ్రీ నిర్మాత ద‌గ్గుబాటి రామానాయుడు కుమార్తె శ్రీల‌క్ష్మిని వివాహం చేసుకున్నాడు. ఆ త‌ర్వాత ఆమెతో విడాకులు అనంత‌రం అప్ప‌టి క్రేజీ హీరోయిన్ అమ‌ల‌ను ప్రేమ వివాహం చేసుకున్న సంగ‌తి తెలిసిందే.

నాగార్జున – అమ‌ల కాంబినేష‌న్లో శివ‌, నిర్ణ‌యం సినిమాలు వ‌చ్చాయి. ఆ స‌మ‌యంలోనే వీరి మ‌ధ్య ఏర్ప‌డిన స్నేహం కాస్తా ప్రేమ‌గా చిగురించి చివ‌ర‌కు వారు పెళ్లి చేసుకునే వ‌ర‌కు వెళ్లింది. ఇదిలా ఉంటే నాగార్జున అప్పుడ‌ప్పుడే కెరీర్‌లో హీరోగా స్థిర‌ప‌డుతోన్న టైంలో తండ్రి ఏఎన్నార్ ఓ హీరోయిన్‌తో త‌న కుమారుడిని పెళ్లి చేసుకోమ‌ని ప్ర‌పోజ‌ల్ పెట్టాడ‌ట‌. ఆ హీరోయిన్ ఎవ‌రో కాదు అల‌నాటి సీనియ‌ర్ హీరోయిన్ సుమ‌ల‌త‌.

గుంటూరు జిల్లా రేప‌ల్లెకు చెందిన సుమ‌ల‌త 1980వ ద‌శ‌కంలో ఎంతో మంది స్టార్ హీరోల‌తో ఎన్నో సూప‌ర్ హిట్ సినిమాలు చేసింది. ఏఎన్నార్ ప‌క్కన కూడా సుమ‌ల‌త న‌టించింది. ఈ క్ర‌మంలోనే ఓ సినిమా షూటింగ్ స్పాట్లో ఏఎన్నార్ సుమ‌ల‌త‌ను స‌ర‌దాగా ఆట‌ప‌ట్టించార‌ట‌. ఏమ్మా ఓ అబ్బాయ్‌ని చూశాను.. నీకు పెళ్లి చేసుకుంటావా ? అని అడిగార‌ట‌.

అమెరికాలో చ‌దువుకున్నాడు.. ఆరు అడుగుల అంద‌గాడు.. కుర్రాడు చాలా మంచివాడ‌ని ఆమెకు చెప్పార‌ట‌. వెంట‌నే సుమ‌ల‌త ఎవ‌రు సార్ అని అడిగితే మా అబ్బాయ్ నాగార్జున అని చెప్పార‌ట‌. దీంతో సుమ‌ల‌త సిగ్గుతో మెలిక‌లు తిరిగిపోయింద‌ట‌. అయితే ఏఎన్నార్ స‌ర‌దాగా ఈ పెళ్లి ప్ర‌పోజ‌ల్ తెచ్చినా చాలా రోజుల పాటు ఇది అప్ప‌ట్లో ఓ సంచ‌ల‌న వార్త‌గా ఉంద‌ని సుమ‌ల‌తే స్వ‌యంగా చెప్పింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news