జోష్ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన నాగచైతన్య కెరీర్ పెళ్లికి ముందు మరీ జోరుగా సాగకపోయిన.. ఆ తరువాత మాత్రం మంచి ఊపందుకుంది. ప్రస్తుతం వేగంగా సినిమాలను లైన్ లో పెడుతున్న హీరోలలో నాగచైతన్య కూడా ఉన్నాడు. అదేవిధంగా బాక్సాఫీస్ వద్ద తన మార్కెట్ ను కూడా అంతకంతకూ పెంచుకుంటూనే ఉన్నాడు. తనకు నచ్చిన విధంగా కొన్ని మంచి ప్రయత్నాలు చేసుకుంటూ ముందుకు వెళుతున్నాడు చైతూ. పేతుతం ఫీల్‌గుడ్ సినిమాల దర్శకుడు శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో లవ్‌స్టోరి అనే సినిమాతో బాక్సాఫీస్ వద్ద బొంబాట్ హిట్ అందుకోడానికి రెడీగా ఉన్నాడు అక్కినేని నాగచైతన్య.
ఇక పెళ్లి తరువాతా నాగచైతన్య సినిమా సంగతులు అన్ని సమంతనే చూసుకుంటుందట. ఇక కథల విషయంలో కూడా చాలా బాగా హెల్ప్ చేస్తున్నట్లు ఇండస్ట్రీలో టాక్ అయితే వస్తోంది. రీసెంట్ గా నాగ చైతన్య తండ్రి నాగార్జునతో కలిసి బంగార్రాజు సినిమాను స్టార్ట్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా తరువాత విక్రమ్ కుమార్ దర్శకత్వంలో థాంక్యూ అనే మరొక సినిమాను కూడా లైన్లో పెట్టాడు.
ఇక ఆ రెండు సినిమాల తరువాత విజయ్ కనకమేడల దర్శకుడితో కూడా ఒక సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. విజయ్ కనకమేడల ఈ ఏడాది నాంది సినిమాతో దర్శకుడిగా పరిచయమై..బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ ని కూడా రాబట్టింది.ఇక ఈయన రీసెంట్ గా సమంత ద్వారా నాగచైతన్య కు కధ చెప్పాడని..ఆ స్టోరీ సమంతకు బాగా నచ్చేసిందని అంటున్నారు. ఇక సమంత స్పెషల్ రిక్వెస్ట్ మీద నాగ చైతన్య ఈ సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని కథనాలు వెలువడుతున్నాయి.