సౌత్ లో సూపర్ ఫాలోయింగ్ ఉన్న స్టార్ హీరోయిన్స్ లో కాజల్ అగర్వాల్ ఒకరు. తెలుగు, తమిళ భాషల్లో వరుస సినిమాలు చేస్తూ దశాబ్ధ కాలంగా కాజల్ క్రేజ్ ఏ రేంజ్ లో ఉందో అందరికి తెలిసిందే. అయితే తేజ డైరక్షన్ లో లక్ష్మి కళ్యాణం సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది కాజల్ అగర్వాల్. ఆ తర్వాత వరుస స్టార్ సినిమాల్లో నటించి సూపర్ సక్సెస్ అయ్యింది. కెరియర్ కాస్త వెనుకపడినట్టు అనిపించిన ప్రతిసారి మళ్లీ ఉత్సాహంగా సినిమాలు చేస్తూ దూసుకెళ్తుంది కాజల్.
సినీ ఇండస్ట్రీలోకి వచ్చి దాదాపు 13 ఏళ్లు గడుస్తున్నా ఇప్పటికీ టాప్ హీరోయిన్ గానే రాణిస్తోంది టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్. అప్పటి నుంచి కెరీర్లో వెనక్కి తిరిగి చూసుకోలేదు కాజల్. రెండు తరాల హీరోలతో ఒకేసారి నటించి వారి తో రొమాన్స్ చేసే హీరోయిన్ కాజల్ రికార్డులకెక్కింది. రామ్ చరణ్ తో కలిసి నటించిన ఈమె చిరంజీవితో కూడా కలిసి నటిస్తోంది అలాగే అక్కినేని నాగ చైతన్య తో రొమాన్స్ చేసిన కాజల్ నాగార్జునతో కలిసి ఆడిపాడబోతుంది.
గతేడాది అక్టోబర్ 30న ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లును వివాహం చేసుకుని సెటిల్ అయ్యారు. ఈ జంట సూపర్ హిట్ గా ఉందంటూ మేడ్ ఫర్ ఈచ్ అదర్ అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు నెటిజన్లు. చిన్ననాటి స్నేహితుడు గౌతమ్ కిచ్లుని వివాహమాడిన కాజల్ అగర్వాల్ ప్రస్తుతం వైవాహిక జీవితాన్ని సంతోషంగా గడుపుతుంది.
ప్రస్తుతం ఆమె చిరంజీవి నటిస్తున్న ఆచార్య సినిమాతో పాటు నాగార్జున హీరోగా నటిస్తున్న ఓ సినిమా ద్వారా కూడా ప్రేక్షకులను అలరించబోతోంది. తాజాగా సోషల్ మీడియాలో ఫ్యాన్స్ తో మాట్లాడుతూ ..కాజల్ అగర్వాల్ తన అభిమానులను షాక్ గురిచేసింది. కాజల్.. తన భర్త వద్దంటే సినిమాలో మానేయడానికి ఏమాత్రం ఆలోచించని చెప్పడంతో.. తమ అభిమాన నటి భవిష్యత్తులో ఎప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో అని అభిమానులు కంగారుపడుతున్నారు.