టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి..యంగ్ హీరోలకు ఏమాత్రం తీసిపోకుండా..ఆరు పదుల వయసులోనూ సూపర్ ఫాస్ట్ గా సినిమాలను ప్రకటిస్తూ.. మళ్లీఆ నాటి చిరును గుర్తుకు తెస్తున్నారు. చిరంజీవి ఆయన నటించే సినిమాల్లో తన అభిమానులకు నచ్చే విధంగా అంశాలు ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటునే..సోసైటీకి ఉపయోగపడే మెసేజ్ ఓరియంటేడ్ సినిమాలకు గ్రీన్ సిగనల్ ఇస్తున్నారు చిరంజీవి.
ప్రస్తుతం చిరంజీవి ఆచార్య సినిమా షూటింగ్ ని కంప్లీట్ చేసుకుని.. మలయాళ ‘లూసిఫర్’ తోపాటుగా తమిళ ‘వేదాళం’ చిత్రాన్ని కూడా రీమేక్ చేయనున్న సంగతి తెలిసిందే. మోహన్ రాజా దర్శకత్వం వహించనున్న ఈ మూవీ చిత్రీకరణ ఇప్పటికే షురూ అయింది. అయితే ఈ సినిమా తరువాత చిరు మరో రీమేక్ సినిమాకు కూడా గ్రీన్ సిగనల్ ఇచ్చిన్నట్లు తెలుస్తుంది.గౌతమ్ మీనన్, అజిత్ డైరెక్షన్ లో వచ్చిన యెన్నై అరిందాల్ అనే సినిమా ఎంత హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే రీసేంట్ గా ఈ సినిమా చూసిన చిరు.. ఈ మూవీని తెలుగులో రీమేక్ చేయాలని డిసైడ్ అయ్యారట.
అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం..ఈ సినిమాను చిరంజీవి సన్ రామ్ చరణ్‌నే నిర్మాతగా వహిస్తున్నట్లు తెలుస్తుంది. ఇక ఈ సినిమా రీమేక్ కోసం ఈ మంచి టాలేంటెడ్ దర్శకుడి కోసం ఎదురుచూస్తున్నారట. ఇక ఈ సినిమా స్టోరి విష్యానికి వస్తే ..ఓ యువతిని క్రిమినల్ నుంచి కాపాడే మాజీ పవర్ ఫుల్ పోలీసాఫీసర్ పాత్రలో చిరు కనిపించనున్నట్లు టాక్ వినిపిస్తుంది. మరి ఈ సినిమాకు దర్శకుడిగా ఎవరు వస్తారో తెలియాలి అంటే అధికారిక సమాచారం వచ్చే వరకూ వేచి చూడాల్సిందే.