Gossipsఆ సీన్స్ కి కృతి వేస్ట్..అసలు పనికిరాదు..సీరియస్ అయిన డైరెక్టర్..??

ఆ సీన్స్ కి కృతి వేస్ట్..అసలు పనికిరాదు..సీరియస్ అయిన డైరెక్టర్..??

అదృష్టం..ఎప్పుడు..ఎవరిని.. ఎలా.. వరిస్తుందో మనం చెప్పలేం. ఎవరి దశ ఎప్పుడు ఎలా తిరుగుతుందో అసలకి చెప్పలేం. అలాంటి దానికి బెస్ట్ ఉదాహరణ.. ఈ కృతి పాప. అదేనండి కృతి శెట్టి..ఉప్పెన సినిమాతో ఓవర్ నైట్ స్టార్ గా మారిపోయి.. టాప్ హీరోయిన్ల లిస్ట్ లో చేరిపోయింది. ఈ సినిమా రిలీజ్ అయ్యేవరకు ఈమె పేరుకూడా తెలియదు. కానీ, ఈ సినిమా తరువాత..ఈమె దర్శక నిర్మాతల పాలిట అదృష్ట్ దేవతగా మారిపోయింది.

వైష్ణ‌వ్ తేజ్ హీరోగా తెర‌కెక్కిన ఉప్పెన ద్వారా హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన కృతి శెట్టి.. త‌న మొద‌టి చిత్రంతోనే ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది. చేసిన మొదటి సినిమాతోనే ఆడియన్స్‌‌ని మేస్మైరైజ్ చేసింది ఉప్పెన భామ కృతిశెట్టి. కేవలం ఒకే ఒక్క సినిమాతో తెలుగు ఇండస్ట్రీని షేక్ చేసిన చిన్నది కృతిశెట్టి. దీంతో టాప్ స్టార్స్ మొదలుకొని స్టార్ డైరెక్టర్ల చూపు ఇప్పుడు ఈ అమ్మాయి పైన పడింది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం.. కృతి 3 సినిమాలో నటిస్తుంది.

ప్రస్యుతం రామ్ పోతినేని లింగుస్వామి కాంబినేషన్లో తెరకెక్కుతున్న మాస్ మసాలా చిత్రంలో హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమా షూటింగ్ ఇటీవలే మొదలు అయిన విష్యం తెలిసిందే. ఇక ఈ సినిమా షూటింగ్ లో ఆమెకు చేదు అనుభవం ఎదురైంది. ఉప్పెన భామ ఓ సూపర్ ..బంపర్..అంటూ పొగిడేసారుగా..కానీ ఈ బ్యూటికి సరిగ్గా నటించడం రాదు అంటూ డైరెక్టర్ లింగుస్వామి ఆమె పై సీరియస్ అయ్యాడని టాలీవుడ్ లో వార్తలు వినిపిస్తున్నాయి.

సినిమా షూటింగ్ నేపథ్యంలో ఓ ఎమోషనల్ సీన్ లో ఆమె సరిగ్గా చెయ్యలేదట.. డైరెక్టర్ చాలా టైం ఇచ్చి నేర్పించారట..కానీ.. దర్శకుడు కోరిన ఎక్స్ ప్రెషన్స్ ఇవ్వలేక కృతి ఇబ్బంది పడ్డి..డైరెక్టర్ పై చిరాకు చూపించిందట. దీంతో విసిగిపోయిన డైరెక్టర్ లింగుస్వామి కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ.. గట్టిగా కేకలు వేశారట. ఎంత ట్రై చేసిన కృతికి ఆ ఎక్స్ ప్రెషన్స్ రాకపోవడంతో..డైరెక్టర్ సీరియస్ అయ్యాడట. ఇక ప్యాకప్ తరువాత.. డైరెక్టర్ తోటి నటులతో మాట్లాడుతూ..కృతికి ఎమోషనల్ సీన్స్ చెయ్యడం చేతకాదు..ఇలాంటి సీన్స్ కి ఈమె వేస్ట్ అన్నట్లు ఓ వార్త టాలీవుడ్ సర్కిల్ లో చక్కర్లు కొడుతుంది. మరి కృతి ని ఇబ్బంది పెట్టిన ఆ సీన్స్ ఎంటో తెలియాలి అంటే సినిమా రిలీజ్ వరకు ఆగాల్సిందే..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news