చిరంజీవి- రోజా.. వన్ ఆఫ ది బెస్ట్ ఆన్ స్క్రీన్ కపుల్.. ఈ జంట బొమ్మ తెర మీద పడితే కేవ్వుకేక నే. ఒకప్పుడు చిరంజీవితో చాలా సినిమాలు చేసిన రోజా..ఆయనకు పెద్ద అభిమాని.ఇక వీళ్లిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన ప్రతి సినిమా బాక్స్ ఆఫిస్ దగ్గర రికార్డ్ లు క్రియేట్ చేసింది. అప్పట్లో ఈ జంట కలిసి నటిస్తే చాలు సినిమా సూపర్ హిట్ అవ్వాల్సిందే. ఒకప్పుడు చిరుతో వరస సినిమాలు చేసిన రోజా ఆ తర్వాత ఆయనకు రాజకీయంగా ప్రతిపక్షం అయిపోయింది.
చిరంజీవి తో కలిసి ”మావోయ్.. మావ మావ మావా” అంటూ అప్పట్లో ఆడియన్స్‌ని హూషారెత్తించారు రోజా.. ముఠా మేస్త్రితో పాటు ముగ్గురు మొనగాళ్లు, బిగ్ బాస్ లాంటి సినిమాల్లో చిరుతో పోటీపడి నటించారు. వెండితెరపై ఈ ఇద్దరు పండించిన కెమిస్ట్రీ ఆడియన్స్‌ని ఉర్రూతలూగించింది.
ఈసెంట్ గా మెగాస్టార్ చిరంజీవి తన పుట్టినరోజును కుటుమబ సభ్యులతో ఘనంగా జరుపుకున్న సంగతి తెలిసిందే. దీని కి సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇక చిరంజీ పుట్టినరోజు సంధర్భంగా.. ప్రత్యేకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలుపారు రోజా. అలాగే ఆయనతో ఉన్న సినీ అనుబంధాలు గిరించి గుర్తుచేసుకున్నారు.
ఆమె కాలేజీలో చదువుకునే రోజుల్లోనుంచే చిరంజీవికి పెద్ద ఫ్యాన్‌ని అని, ఇప్పటికీ ఆయన్ను కలిస్తే అలాగే అనిపిస్తుందని చెప్పారు. చెన్నైలో ఉన్నప్పుడు షూటింగ్‌లో ఏ మాత్రం గ్యాప్ వచ్చిన వెంటనే.. చిరంజీవి గారి ఇంటికి వెళ్లిపోయే వాళ్లమని.. అప్పుడు చిరంజివి భార్య సురేఖ అక్క అందరినీ చాలా బాగా చూసుకుంటుందని చెప్పుకొచ్చరు. ఎవ్వరైనా సరే ఒక్కసారి ఆ ఇంటికి వెళ్లారంటే మళ్ళీ ఆ ఇల్లును వదిలి పెట్టి రావలంటే మనసు రాదు ..అంత బాగా చూసుకుంటారు సురేఖా అక్క అంటూ చిరంజీతో తనకున్న పాత మెమోరీస్ ని నెమరు వేసుకున్నారు రోజా.