నిర్మాత నట్టి కుమార్.. ఈ పేరుకి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈ మధ్య కాలంలో తరచూ సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటూ ఎక్కువగా వివాదాలకు కారణం అవుతున్నారు. ముఖ్యంగా గత కొద్ది రోజుల నుంచి ఏదో ఒక విషయం ద్వారా వార్తల్లో నిలుస్తూ..హాట్ టాపిక్ గా మారుతున్నారు.
తాజాగా సోమవారం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ..కొన్ని ఆసక్తి కర విషయాలు తెలియజేసారు. ఆయన మాట్లాడుతూ..”షూటింగ్‌ల కోసం ఏపీలో సింగిల్ విండో విధానం అమలులో ఉందని.. మరీ అలాంటప్పుడు ఆంధ్రాలో ఎందుకు షూటింగ్‌లు చేయరు? అని సూటిగా పేశ్నించారు. అంతేకాదు మాట్లాడితే.. జగన్ గారు అపాయింట్‌మెంట్ లేదని..ఇవ్వలేదని కొందరు ఆరోపిస్తున్నారుగా…అసలకి అది తప్పు…పెద్ద తప్పు.. అడగనిదే అమ్మయినా అన్నం పెట్టదు..అని మన పెద్ద వాళ్లు అంటారు గా..అలా జగన్ గారిని అడిగితే వీలైనంత త్వరగా స్పందిస్తారు..అంటూ జగన్ ని వెనకేసుకొచ్చారు.
నట్టికుమార్ థియేటర్స్ రెంట్, హీరోయిన్స్ రెమ్యూనరేషన్ పై కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. టికెట్ రేట్లు ఎంత పెరిగినా థియేటర్స్ రెంట్ మాత్రం అంతే ఉంటుందని.. ఒక సినిమాను తెరకెక్కిస్తే ఐదుగురిని మనం పోషిస్తున్నట్లనీ చెప్పుకొచ్చారు. ఈ క్రమంలోనే ప్రస్తుతం హీరోయిన్ల రెమ్యూనరేషన్లు గురించి ఆయన మాట్లాడుతూ..ఒకప్పుడు హీరోయిన్లకు 30 నుంచి 40 లక్షల వరకు రెమ్యూనరేషన్ ఇచ్చేవారని..అదే ఇప్పుడు చూస్తే నిన్నగాక మొన్న ఇండస్ట్రీలోకి వచ్చిన హీరోయిన్ కి ఏకంగా రెండు కోట్లు రెమ్యూనరేషన్ ఇస్తున్నారని..రెమ్యూనరేషన్ మాత్రమే కాకుండా వారికి బాడీగార్డులు, ప్రత్యేకమైన కారవాన్, వారి అసిస్టెంట్లకు ఒక కారవాన్ ఇలా కోట్లకు కోట్లు ఖర్చు పెడుతున్నారంటూ ఘాటుగా స్పందించారు. ప్రేక్షకుల సొమ్మును హీరో హీరోయిన్లకు పారితోషికం రూపంలో ఇస్తున్నారు..అంటూ మండిపడ్డారు.