టాలీవుడ్ సూపర్ స్టార్ ఘట్టమనేని కృష్ణ వారసుడిగా సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన మహేష్ బాబు తండ్రికి తగ్గ తనయుడిగా గుర్తింపు పొందాడు. బాల నటుడిగా ప్రవేశించి ఆ తర్వాత హీరోగా తన కంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు మహేష్ బాబు. మహేష్ బాబు చిత్ర పరిశ్రమకి రాజకుమారుడు సినిమాతో హీరోగా పరిచయమైయ్యాడు.
టాలీవుడ్ లో మహేష్ బాబు అంటే ఎంత క్రేజ్ ఉందో మనకు తెలిసిందే. ఆయన నటనకు, మంచితనానికి ఎవ్వరైనా సరిలేరు నీకెవ్వరు అనాల్సిందే. సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం టాలీవుడ్ లో నెంబర్ వన్ హీరోగా కొనసాగుతున్నారు. వరుస విజయాలను అందుకుంటూ దూసుకుపోతున్న మహేష్ గురించి అందరికి తెలిసిందే. అయితే మహెష్ బాబు మొదట్లో కొన్ని తప్పుడు కథలను ఎంచుకొని ఆయన కెరీర్ లో ఎన్నో ఫ్లాప్ సినిమాలను ఎదుర్కొన్నాడు. అలా ఒక్కడు సినిమా కి ముందు టక్కరి దొంగ, బాబీ వంటి సినిమాలను చేసి భారీ ఫ్లాప్ లను ఎదుర్కున్నాడు. అయితే ఒక్కడు సినిమా తో బిగ్గెస్ట్ హిట్ అందుకుని మళ్లీ ఫామ్ లోకి వచ్చాడు.
ఇక పోకిరి సినిమా కి ముందు చేసిన నిజం, నాని. అర్జున్ సినిమాలు కూడా మహేష్ కు చేదు అనుభవాలని మిగిల్చింది. ఆ తర్వాత పోకిరి సినిమా సృష్టించిన రికార్డులు అన్నీఇన్నీ కావు. ఆ తరువాత చేసిన నిజం, నాని సినిమాలు బాక్స్ ఆఫిస్ ముందు భారీ డిజాస్టర్ గా నిలిచాయి. ఇక అదేవిధంగా దూకుడు సినిమాకి ముందు.. సైనికుడు, అతిథి , ఖలేజా సినిమాలు కూడా అత్యంత దారుణంగా పరాజయం పాలయ్యాయి.
ముఖ్యంగా అతిధి సినిమా తర్వాత ఆయన కోలుకోలేక పోయారు. కానీ ఆ తరువాత తనదైన స్టైల్లో సినిమా కధలు ఎంచుకుంటూ మళ్లి టాప్ హీరో ల లిస్ట్ లో చేరాడు. ఇలా ఘట్టమనేని వారసుడు మహెష్ బాబు తన కెరీర్ లో ఎన్నో ఫ్లాప్ సినిమాలను ఎదుర్కుంటూ..మళ్లి మంచి ఫాం లోకి వచ్చి ఘట్టమనేని వారసుడు గట్టోడే అనిపించుకున్నాడు. ప్రస్తుతం మహెష్ బాబు సర్కారు వారి పాట అనే సినిమా షూటింగ్ లో బిజీ బిజీ గా ఉన్నారు.