Moviesఆ ఒక్క కారణంతోనే నేను కధ చెప్తానంటే పెద్ద హీరోలు టైం...

ఆ ఒక్క కారణంతోనే నేను కధ చెప్తానంటే పెద్ద హీరోలు టైం ఇవ్వరు..శేఖర్ కమ్ముల షాకింగ్ కామెంట్స్..!!

శేఖర్ కమ్ముల..టాలీవుడ్ ఫీల్ గుడ్ సినిమాల దర్శకుడు అంటూ సినీ ఇండస్ట్రీలో పిలుస్తుంటారు. శేఖర్ కమ్ముల ఇండస్ట్రీలోకి వచ్చి దాదాపు 20 సంవత్సరాలు అవుతున్నప్పటికీ అతడు తీసిన సినిమాలు చాల తక్కువ. ఆలస్యంగా వచ్చినా ఆయన సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ విజయాలను సొంతం చేసుకుంటాయి.శేఖర్ కమ్ముల సినీ ఇండస్ట్రీ లో దశాబ్దం పైగానే కుటుంబ కథా చిత్రాలు చేస్తూ మంచి విజయాలు అందుకుంటున్న ఏకైక డైరెక్టర్.


కాగా శేఖర్ క‌మ్ముల‌ సినీ కెరీర్ లో ‘గోదావరి’, ‘లైఫ్ ఈస్ బ్యూటిపుల్’, ‘హ్యాపి డేస్’, ‘ఫిదా’ వంటి ఎన్నో మంచి హిట్లు ఉన్నా ఇప్పటి వరకు ఒక్క స్టార్ హీరోతో కూడా శేఖర్ క‌మ్ముల‌ సినిమా చేయకపోవడం విచిత్రంగా కనిపిస్తుంది. నిజానికి పెద్ద హీరోలతో సినిమాలు తీయాలి అన్నది శేఖర్ కమ్ముల డ్రీమట. గతంలో కూడా మహేష్ తో సినిమా తీయాలని శేఖర్ కమ్ముల చాల ప్రయత్నాలు చేసాడు. కానీ మహేష్ కు ఈయన కధలు నచ్చలేదట.

ఆయన దగ్గర శిష్యరికం చేసిన శిష్యులు పెద్ద హీరోలతో సినిమాలు చేసుకుంటూ టాప్ డైరెక్టర్ గా ఎదిగారు. అందుకు బెస్ట్ ఉదాహరణ..నాగ్ అశ్విన్. తొలి రెండు సినిమాలను చిన్న స్టార్లతో నే చేసినా.. ఇప్పుడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తో సినిమా పట్టేశాడు. ఇక ఇలాంటి సంధర్భంలో శేఖర్ కమ్ముల ని మీరు పెద్ద హీరోలతో సినిమా ఎందుకు చెయ్యరు అని అడిగినప్పుడు.. శేఖర్ క‌మ్ముల‌ ఏమన్నాడో తెలుసా..??

పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, ఎన్.టి.ఆర్ లాంటి పెద్ద హీరోలతో సినిమా చేయాలని ఉంటుందట. కానీ ఆయన కథ చెప్తానంటే పెద్ద హీరోలెవరూ సమయం ఇవ్వరట. ఎందుకంటే ఆయన కథ చెప్తే వాళ్ళకి నీరసం వస్తుందని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం శేఖర్ క‌మ్ముల‌ దర్శకత్వంలో తెరకెక్కిన లవ్ స్టోరి రిలీజ్ కి రెడీగా ఉంది. త్వరలో కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ తో ఓ త్రిభాషా చిత్రానికి దర్శకత్వం వహించబోతున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news