స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ – సుకుమార్ కాంబోలో వస్తున్న క్రేజీ మూవీ పుష్ప. పాన్ ఇండియా రేంజ్లో ఐదు భాషల్లో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్. ఈ సినిమాలో ఫహద్ ఫాజిల్ విలన్ గా కనిపించనున్నారు. ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ హీరోయిన్. ఇక రంగస్థలం సినిమాలో చిట్టిబాబు పాత్రను మించేలా పుష్ప పాత్ర ఉంటుందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. శేషాచలం అడవుల్లోని గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో ఈ సినిమా కథ ఉంటుందని తెలుస్తోంది.
ఇక బన్నీ సినిమాలను డబ్ చేస్తే ఏ రేంజ్ క్రేజ్ ఉంటుందో చెప్పక్కర్లేదు. బన్నీ – సుకుమార్ కాంబినేషన్లో వస్తోన్న పుష్పపై భారీ అంచనాలు ఉన్నాయి. పుష్ప టీజర్ యూట్యూబ్ ని షేక్ చేసింది. ఇక ఆగస్ట్ 13 ఉదయం విడుదలైన అల్లు అర్జున్ పుష్ప సినిమా ఫస్ట్ సింగిల్ దాక్కో దాక్కో మేక . ఈ పాట నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. అలా దాక్కో దాక్కో మేక అనే పాట ఇప్పుడు యూట్యూబ్లో ట్రెండ్ అవుతోంది. కాగా తాజాగా ఈ సినిమా నుంచి కొన్ని సన్నివేశాలు లీక్ అయ్యాయి. ఈ సినిమా నుంచి ఓ ఫైట్ సీన్ ను లీక్ చేశారు కొందరు కేటుగాళ్లు.
ఇటీవల పాన్ ఇండియా ప్రాజెక్టుగా వస్తున్న ‘పుష్ప’ మూవీ నుంచి కొన్ని పిక్స్, పాట ముందే బయటకు వచ్చేశాయి. దీంతో చిత్ర నిర్మాతలు సైబర్ క్రైమ్ పోలీసులను కూడా ఆశ్రయించారు. అంతేకాదు, ఇప్పటికే ఈ విషయం మీద సినిమా నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ సీరియస్ అయ్యి .. ఇలాంటి లీకేజీ రాయుళ్లు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది. అలా హెచ్చరించిన కొద్ది సేపటికి మరో వీడియో లీక్ కావడం ఇప్పుడు సినిమా యూనిట్ కి షాక్ అనే చెప్పాలి.ఇక లీకైన వీడియో ఆధారంగా చూస్తుంటే భారీ యాక్షన్ సీక్వెన్స్ లా కన్పిస్తోంది. ఎడిటింగ్ టేబుల్ లేదా రీ-రికార్డింగ్ టేబుల్ నుండి వీడియో లీక్ అయినట్లు తెలుస్తోంది. ఏదేమైనా ఇలాంటి లీక్ ల వల్ల సినిమా ప్రాఫిట్స్ విషయంలో భారీగా దెబ్బ తినే అవకాశం ఉందంటున్నారు సినీ విశ్లేషకులు
#pushpa Leaked video pic.twitter.com/aIRpkCLBBV
— Pawan Kalyan Abhimani (@pawankalyan_09) August 15, 2021