మహేష్ బాబు.. టాలీవుడ్ ఎవర్ గ్రీన్ రాజకుమరుడు. వయసు పెరుగుతున్న ఆయన అమదం మాత్రం తగ్గడం లేదు. ఇంకా చెప్పాలంటే.. ఏళ్లు గడుస్తున్న కొద్ది ఆయన అందం పెరిగిపోతూనే ఉంది.. ఆ సిక్రేట్ ఏంటో ఇప్పటికి ఎవరికి అర్దం కాదు. టాలీవుడ్ మోస్ట్ హ్యాండ్ సం హీరోలలో మొదటి ప్లేస్ లో ఉంటాడు మహెష్ బాబు.
సూపర్ స్టార్ మహేష్ బాబు.. సరిలేరు నీకెవ్వరు సినిమాతో మంచి సక్సెస్ అందుకున్నాడు. ఈ సినిమా తర్వాత వంశీ పైడిపల్లితో నెక్ట్స్ మూవీ చేయాలనుకున్నాడు. కానీ ఎందుకో ఆ ప్రాజెక్ట్‌ను హోల్డ్‌లో పెట్టి పరశురామ్‌తో నెక్ట్స్ ప్రాజెక్ట్ సెట్ చేసుకున్నాడు. సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వంలో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ‘సర్కారు వారి పాట’ అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో కీర్తిసురేష్ హీరోయిన్ గా నటిస్తుంది. బ్యాంకింగ్ రంగంలో జరిగే మోసాల నేపథ్యంలో ఈ సినిమా ఉండనుందని తెలుస్తుంది. ప్రస్తుతం మహెష్ బాబు ఈ సినిమా షూటింగ్ లో బిజీ బిజీ గా ఉన్నారు.
అయితే టాలీవుడ్ స్టార్ హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు రీసెంట్ గా పుట్టిన రోజు (ఆగస్టు 9).46 వసంతాలు పూర్తి చేసుకొని తాజాగా 47 లోకి అడుగుపెట్టారు ఆయన. ఈ సంధర్బంగా ఆయన గురించి కొన్ని ఆసక్తి కరమైన అంశాలు నెట్టింట్లో వైరల్ గా మారాయి. ఈ క్రమంలోనే మహేష్ బాబు కి భార్య నమ్రత అంతే ఎక్కువ ఇష్టమా..?? లేక తల్లి ఇందిర అంటే ఎక్కువ ఇష్టమా..? అనే పాయింట్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఇకపోతే మహేష్ బాబు ఈ ప్రశ్నకు చాలా ఇంటర్వ్యులో పరోక్షంగానే జవాబు ఇచ్చారు. మహేష్ కు తల్లి, భార్య… ఈ ఇద్దరు మహిళలు తన జీవితంలో సాధించిన ఎన్నో విషయాలకు కారణమని ఆయన చాలా సందర్భాల్లో చెప్పారు.