Moviesబుల్లితెర పై దూసుకుపోతున్న ఈమె భర్త ఎవరో తెలుసా..?

బుల్లితెర పై దూసుకుపోతున్న ఈమె భర్త ఎవరో తెలుసా..?

బుల్లితెర మీద సీరియల్స్ కి గల క్రేజ్ మామూలు రేంజ్ లో లేదు. తెలుగు బుల్లితెరపై సిరియల్స్ ఆడియన్స్ ని బాగానే ఆకట్టుకుంటున్నాయి. అందుకే అన్ని సీరియల్స్ బాగా టీఆర్పీస్ తెచ్చుకుంటున్నాయి.. ధారావాహికంగా నడుస్తున్నాయి. ట్వ్ సీరియల్స్ ఆడియన్స్ బాగా కనెక్ట్ అవ్వడంతో మంచి ఆదరణకు నోచుకుంటున్నాయి. ఇక స్టార్ మా ఛానల్ లో ప్రసారమవుతున్న సీరియల్స్ బాగా ప్రేక్షకులను అట్రాక్ట్ చేస్తున్నాయి.

ఇంటికి దీపం ఇల్లాలు సీరియల్ కొద్దికాలంలోనే ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. ఇందులో నటీనటులు తమ నటనతో,అందంతో అలరిస్తున్నారు. అందుకే మంచి టిఆర్పి రేటింగ్ తో దూసుకెళ్తోంది. ఒక ఇల్లాలు భర్త ప్రేమ కోసం ఎంతలా కష్టపడుతోందో..తపిస్తుందో ఈ సీరియల్ నిరూపిస్తోంది. అయితే హీరోయిన్ గా చేస్తున్న కృష్ణప్రియ తన అభినయంతో,అందంతో మొదటి సీరియల్ తోనే మంచి గుర్తింపు సాధించిన.. ఈమె అసలు పేరు దీపిక.

దీపిక 1991 జూన్ 27న బెంగళూరులో జన్మించి.. అక్కడే చదువు కంప్లీట్ చేసింది. ఈమెకు చిన్నప్పటి నుండి డాన్స్ అంటే పిచ్చ ఇష్టమట. డ్యాన్స్ ట్రైనింగ్ తీసుకుని మరీ స్కూల్స్ ప్రోగ్రామ్స్ లో,స్టేజ్ షోస్ లో పాల్గొంది..అంటేనే ఆమెకు డ్యాన్స్ అంటే ఎంత ఇష్టమో అర్ధం చేసుకోవచ్చు.

ఈమె ఓ పెద్ద కంపెనీలో సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తున్న సమయంలోనే.. ఫ్రెండ్స్ సలహాతో సీరియల్ ఆడిషన్స్ కి వెళ్ళి..సెలక్ట్ అయింది. ఉదయ్ టివిలో ప్రసారమైన కులవధు సీరియల్ తో కన్నడ బుల్లితెరకు ఎంట్రీ ఇచ్చి, తొలిసిరియల్ తోనే సక్సెస్ కొట్టింది. వెయ్యి ఎపిసోడ్స్ వరకూ ఈ సీరియల్ నడిచింది. తర్వాత స్టార్ సువర్ణ లో హారతి గుబ్బ, కీర్తి గుబ్బ సీరియల్స్ లో చేసింది. దీపిక 2019లో సౌత్ ఇండియన్ గ్లామర్ అవార్డు, మిస్ బ్యూటిఫుల్ స్మైల్ అవార్డు అందుకుంది. అదే ఏడాది కన్నడ సీరియల్ నటుడు ఆకాష్ ను పెళ్లిచేసుకుంది.

 

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news