టాలీవుడ్ సూపర్ స్టార్ ఘట్టమనేని కృష్ణ వారసుడిగా సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన మహేష్ బాబు తండ్రికి తగ్గ తనయుడిగా గుర్తింపు పొందాడు. ఇప్పటికే టాలీవుడ్ కి ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలను అందించిన మహెష్ బాబు..తాజా గా మరోసారి బాక్స్ ఆఫిస్ ని షేక్ చేయడానికి సర్కారు వారి పాట అనె సినిమాతో మన ముందుకు రాబోతున్నాడు. ఇక మహెష్ బాబు కేవలం సినిమాలతోనే కాకుండా ఎన్నో సామాజిక సేవలతో ఇండస్ట్రీలో ముందున్నాడు.
మహేష్ బాబు రేంజ్ గురించి స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ప్రతి సినిమాకు తన మార్కెట్ పరిధిని పెంచుకుంటూ వస్తున్నాడు. ఎక్కువగా ప్రయోగాలకు వెళ్లకుండా అభిమానులకు కావాల్సిన వినోదాన్ని ఇస్తూ అటు నిర్మాతలను బయ్యర్లకు కూడా సేఫ్ జోన్ లో ఉంచేలా కథలను సెలెక్ట్ చేసుకుంటున్నాడు. డిజాస్టర్స్ వెక్కిరించిన ప్రతిసారి తరువాత సినిమాను బాక్సాఫీస్ బద్దలు కొట్టేలా తీస్తున్నాడు.
ఇక ప్రస్తుతం మహేష్ బాబు 50కోట్లకు పైగానే పారితోషికాన్ని అందుకుంటున్నాడని సినీ వర్గాల సమాచారం. అయితే, ఇప్పుడు ఒక్కో సినిమాకి 50 కోట్లు తీసుకుంటున్న మహేష్ బాబు.. తన ఫస్ట్ సినిమాకి ఎంత పారితోషకం పుచ్చుకున్నాడొ తెలుసా..?? తెలిస్తే..అసలు నమ్మలేరు. కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో 1999లో రాజకుమారుడు సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన మహేష్ బాబు.. అసలు రెమ్యూనరేషన్ కూడా తీసుకోవద్దని అనుకున్నాడట. అయినప్పటికీ అప్పట్లో మహేష్ బాబు మొదటి సినిమా కోసం 7 లక్షల రెమ్యునరేషన్ తీసుకున్నాడట. ఇక ఆ తరువాత వరుస విజయాలతో దూసుకుపోతూఉ.. పారితోషకాని కూడా పెంచేసాడు మహేష్. ప్రస్తుతం సర్కారు వారి పాట షూటింగ్ లో బిజీ బిజీ గా ఉన్నారు.