Moviesఅసలు "బోమ్మరిల్లు"సినిమాలో హాసిని పాత్ర ఎలా వచ్చిందో తెలుసా..??

అసలు “బోమ్మరిల్లు”సినిమాలో హాసిని పాత్ర ఎలా వచ్చిందో తెలుసా..??

“బొమ్మ‌రిల్లు” ఈ చిత్రం తెలుగు సినీప‌రిశ్ర‌మ‌లో రికార్డులు సృష్టించింది. ఈ సినిమాలో హీరో,హీరోయిన్ లు గా సిధార్డ్,జెనిలియా నటించారు. ఇక సిద్దార్థ్‌ కెరీర్ లో ది బెస్ట్ మూవీ.. ఎవర్ గ్రీన్ మూవి ఉంది అంటే అది “బొమ్మరిల్లు” అనే చెప్పాలి. టాలీవుడ్‌లో బొమ్మరిల్లు సినిమాకు ఓ ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. బొమ్మరిల్లు.. నాన్న ప్రేమ ను చక్కగా చూపించిన సినిమా ఇది.

ప్రముఖ సినీ దర్శకుడు భాస్కర్ కు మంచి పేరు తీసుకొచ్చిన సినిమా. ఎందుకంటే ఈ సినిమా తోనే మొదటిసారిగా సినీ ఇండస్ట్రీలోకి దర్శకుడిగా అడుగు పెట్టాడు బొమ్మరిల్లు భాస్కర్. బొమ్మరిల్లు సినిమాలోని ప్రతీ పాత్ర ఇప్పటికీ తెలుగు ప్రేక్షకులను వెంటాడుతూనే ఉంటుంది. ఇక ఈ సినిమాలో జెనీలియా నటన హైలెట్ అని చెప్పవచ్చు. హ..హా హాసిని అంటూ చాలా క్యూట్ గా నటించింది. ఇక 2006 ఆగస్ట్ 9న విడుదలైన ఈ మూవీ టాలీవుడ్‌లో ఓ హిస్టరీని క్రియేట్ చేసింది. ఇక ఈ సినిమాలో ప్రతి సీన్ హైలైట్ గా ఉంటుంది.

ఇటీవల ఓ యూట్యూబ్‌ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ‘బొమ్మరిల్లు’ భాస్కర్‌ .. సినిమా సక్సెస్‌లో కీ రోల్‌ పోషించిన హాసిని పాత్రను ఎలా క్రియేట్‌ చేశారన్నది ఈ సందర్భంగా వివరించాడు. అనుకోకుండా ఒక రోజు..ఒకమ్మాయిని గుద్ది సారీ చెబితే.. తనొచ్చి ఒకసారి గుద్ది వెళ్లిపోతే కొమ్ములు వస్తాయని మరోసారి ఢీకొట్టి వెళ్లిందట..

ఇక ఈ సినిమాలో హీరోయిన్ రోల్ ఎలా ఉండాలా అని అనుకుంటున్నప్పుడు..వెంటనే నాకు ఆ సీన్ గుర్తు వచ్చింది. అది బాగుందని .. దాని చుట్టూ సన్నివేశాలు అల్లుకుంటూ పాత్రను తీర్చిదిద్దాం. మరుసటి రోజు సాయంత్రం వెళ్లి రాజు గారికి ఈ క్యారెక్టర్ గురించి చెబితే భలే ఉంది అన్నారు. అలా హాసిని పాత్రను చాలా కష్టపడి క్రియేట్‌ చేశాం’ అని వివరించాడు.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news