సాధారణంగా సినీ ఇండస్ట్రీలో కొంత మంది స్టార్ హీరోలు, మంచి కమర్షియల్ సినిమాలలో నటించాలని కొంతమందికి చిరకాల కోరికగా ఉంటుంది. మరికొంతమంది వేరే హీరోలు చేసిన సినిమాలలో నేనెందుకు చేయలేకపోయానబ్బా.. ఇంత మంచి ఛాన్స్ వదులుకున్నాను ఏంటి..? అని బాధను కూడా వ్యక్తం చేస్తూ ఉంటారు. ఇక అలాంటి వారిలో మన మెగాస్టార్ చిరంజీవి కూడా ఒకరు.. ఒక సినిమాను చూసి చాలా ఏడ్చేశాడట ..నేను ఎందుకు ఈ సినిమాను చేయలేదు అని తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యానని, ఆయన ఒక ఇంటర్వ్యూలో తెలపడం గమనార్హం..అయితే ఆ సినిమా ఏంటి .? ఎందుకు చిరంజీవి అంతలా బాధపడ్డాడు..? అనే విషయాలను తెలుసుకుందాం..
1986 సంవత్సరం తెలుగు భాష డ్రామాగా తెరకెక్కిన చిత్రం స్వాతిముత్యం. ఇందులో కమల హాసన్ , రాధిక లు కలిసి నటించారు. ఇక ఈ సినిమాలో కమల్ హాసన్ పాత్ర అమోఘం అని చెప్పవచ్చు . అంతేకాదు ఈయన తప్ప ఎవరు చేయలేరు అని కూడా నిరూపించాడు కమల్ హాసన్. కె.విశ్వనాధ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రానికి, ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా చక్కని పాటలను అందించాడు. ఇప్పటికీ కూడా మనం ఈ సినిమా పాటలను అక్కడక్కడ పెద్ద వాళ్ల రేడియోలలో వింటూనే ఉంటాం.
అయితే ఒకానొక సందర్భంలో ఈ సినిమాను చూసిన చిరంజీవి చాలా బాధపడ్డాడట. ఇంతటి చక్కని సినిమా నేనెందుకు చేయలేకపోయాను అని తనను తాను ప్రశ్నించుకున్నాడట..? ఏదైతేనేం జీవితంలో ఒకసారైనా ఇలాంటి సినిమా కథ తీయవలసి వస్తే , తప్పకుండా ఎంతటి కష్టమైనా తీస్తానని ఆయన చెప్పుకొచ్చాడు.
ప్రస్తుతం ఈయన సినిమాల విషయానికి వస్తే , అన్ని రీమేక్ సినిమాలు చేస్తూ మంచి విజయాన్ని అందుకుంటున్నాడు చిరంజీవి. ఖైదీ నెంబర్ 150 తో తన సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టి , ప్రస్తుతం యంగ్ హీరోలకు కూడా గట్టి పోటీ ఇస్తూ , ఏ వయసులోనైనా సరే తనకు ఎవరూ సాటి రారు అనేంతగా నటించడం గమనార్హం.