Gossipsకీర్తి కి అదిరిపోయే ఆఫర్.. కానీ షాకింగ్ ట్వీస్ట్ ఇచ్చిన స్టార్...

కీర్తి కి అదిరిపోయే ఆఫర్.. కానీ షాకింగ్ ట్వీస్ట్ ఇచ్చిన స్టార్ హీరో..??

కీర్తి సురేష్‌.. ఈ పేరుకన్నా ఆమెకి మహానటి అనే పేరు నే కరెక్ట్ గా సెట్ అవుతుంది అనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఆ సినిమా విడుదలైయే వరకు ఆమె ఒక్క హీరోయిన్ గానే తెలుసు కానీ, ఆ సినిమా తరువాత ఆమె మహానటి సావిత్రి నే అయిపోయింది. అంతలా మనల్ని తన నటన తో ఆకట్టుకుంది ఈ కీర్తి పాప. ‘మహానటి’ సినిమాతో కీర్తి సురేష్‌ సూపర్ క్రేజ్ సంపాదించుకుంది. అంతేకాదు ఇక ఈ సినిమాతోనే ఆమెకు ఉత్తమ జాతీయ నటిగా పురస్కారం లభించింది.

‘నేను శైలజ’ సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన కీర్తి సురేష్.. ఇటు టాలీవుడ్‌లోనూ.. అటు కోలీవుడ్‌లోనూ వరుస సినిమాలతో బిజీగా ఉంది.ఇటివల “రంగ్‌ దే’తో ప్రేక్షకుల్ని ఇటీవల పలకరించిన కీర్తి.. ప్రస్తుతం రజనీకాంత్‌ ‘అన్నాత్తే’, మహేశ్‌ బాబు ‘సర్కారు వారి పాట’ చిత్రాల్లో నటిస్తోంది. నాయికా ప్రాధాన్య చిత్రం ‘గుడ్‌ లక్‌ సఖి’ విడుదలకు సిద్ధంగా ఉంది. తన అభినయంతోనే కోట్లాది మంది అభిమానుల మనస్సులో స్థానం సంపాదించుకుంది. తెలుగుతో పాటు తమిళ, మలయాళ భాషల్లోనూ కీర్తి తన టాలెంట్‌ నిరూపించుకుని వరుస సినిమాలతో దూసుకుపోతోంది.

ఇక తాజాగా అందుతున్న సమాచరం ప్రకారం..కీర్తి సురేశ్‌‌‌కి తమిళంలో ఓ బంపర్ ఆఫర్ వచ్చిందని తెలుస్తోంది. తమిళంలో ఓ స్టార్ హీరోతో కలిసి మరోసారి పని చేయనుందట ఈ భామ. ఆయన మరెవరో కాదు.. ‘సింగం’ సూర్య. గతంలో వీరిద్దరు కలిసి ‘గ్యాంగ్’ అనే సినిమాలో నటించారు. స్టార్ హీరో సూర్య నిర్మిస్తున్న సినిమాలో కీర్తి హీరోయిన్‌‌‌‌గా ఛాన్స్ దక్కించుగుకుందని తెలుస్తోంది. సూర్య సొంత చిత్ర నిర్మాణ సంస్థ అయిన 2డి ఎంటర్ టైన్మెంట్ బ్యానర్ నిర్మిస్తున్న చిత్రంలో కీర్తిని హీరోయిన్‌‌‌గా ఎంపిక చేశారట. ఇక హీరోగా అధర్వ నటిస్తుండగా జాతీయ ఉత్తమ దర్శకుడు అవార్డు గ్రహీత బాల ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారని తెలుస్తోంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news