ఈ రంగుల ప్రపంచం సినీ రంగంలో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు. ఈ రంగుల ప్రపంచం అంటే సినీ ఇండస్ట్రీ లోకి రావడం అంటేనే కష్టం. ఏదోలాగ వచ్చినా అంత సులువుగా అవకాశాలు రావు. దానికి ఎంతో తతంగాలు ఉంటాయి. అని అధికమించి వచ్చినా మంచి ఛాన్స్ లు రావు. ఏదో చిన్న క్యారెక్టర్ లు వస్తాయి. అయితే , వచ్చిన అవకాశాని ఏదైనా సరే సద్వినియోగం చేసుకుంటేనే ఏ రంగంలోనైనా సక్సెస్ అవ్వగలం. అలా ఎన్నో కష్టాలు పడ్డి సిని ఇండస్ట్రీలో అడుగు పెట్టాడు సాయి కిరణ్. ఇతను ప్రముఖ సింగర్.. పి.సుశీల గారి మనవడు అన్న సంగతి చాలా మందికి తెలీదనే చెప్పాలి.
టాలీవుడ్ సినిమా పరిశ్రమలో కొన్ని సినిమాలలో హీరోగా నటించిన సాయికిరణ్ అందరికీ గుర్తుండే ఉంటాడు. కె.విజయ్ భాస్కర్ డైరెక్షన్లో వచ్చిన ‘నువ్వే కావాలి’ చిత్రం ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆ చిత్రంలో సెకండ్ హీరో ప్రకాష్ పాత్రలో నటించాడు సాయి కిరణ్. ‘నువ్వే కావాలి’ చిత్రం తరువాత ‘ప్రేమించు’ ‘మనసుంటే చాలు’ ‘ఎంత బావుందో’ వంటి హిట్ చిత్రాల్లో నటించాడు సాయి కిరణ్. ఇంకా ఎన్నో చిత్రాల్లో హీరోగా నటించాడు.
అయితే వరస హిట్ సినిమాలు చేస్తున్న సమయంలోనే ఒక హీరోయిన్ ప్రేమలో పడి ఆమె చుట్టూ తిరుగుతూ తన కెరియర్ ను నాశనం చేసుకున్నాడు సాయి కిరణ్ అనే వార్త ఇప్పటికీ చక్కర్లు కొడుతుంది. సాయి కిరణ్ మంచి మంచి సినిమాలు చేసినా ఆ సక్సెస్ ను ఎక్కువ రోజులు నిలుపుకోలేక ఫ్లాప్ సినిమాల్లో నటించి మెల్ల మెల్ల గా కనుమరుగై పోయాడు.
అయితే తాజాగా సాయి కిరణ్ గురించి ఓ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. సాయి కిరణ్ అప్పట్లో తాను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించినటువంటి ప్రియురాలిని తన కుటుంబ సభ్యుల కోసం వదిలిపెట్టాడట..అంతేగాక ఆమెతో సాయి కిరణ్ పలు చిత్రాల్లో నటించాడనే వార్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుతం సాయి కిరణ్ చేతిలో పెద్దగా సినిమా అవకాశాలు లేకపోవడంతో బుల్లితెర మీద బాగానే ఆకట్టుకుంటున్నాడు. ప్రస్తుతం మనసిచ్చి చూడు అనే సీరియల్ లో నటిస్తున్న సాయికిరణ్ బుల్లితెర ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్నాడు. గుప్పెడంత మనసు సీరియల్ లో కూడా ఆయన తన నటనతో బాగానే ఆకట్టుకుంటున్నాడు.