మానవ సంబంధాలు మంట గలుస్తున్నాయి. కామంతో కళ్లుమూసుకుపోయిన వాళ్లు బంధుత్వాల్ని సైతం లెక్క చేయడం లేదు. కొందరైతే వావి వరుసలు సైతం మరిచిపోయి లైంగిక సుఖం కోసం వెంపర్లాడుతుండటం చూస్తుంటే సమాజం ఎటువైపు వెళ్తుందోనన్న అనుమానం కలగకమానదు. కేవలం తమ కామవాంఛ తీర్చుకోవడం కోసం అయినవాళ్లని చంపుకుంటున్నారు. తాజాగా అలాంటి ఘటనే ఒకటి చోటు చేసుకుంది. తెలిసినవాడే కదా అని ఇంటికి చేరదీసిన పాపానికి మోసం చేసారు. సిద్దిపేట జిల్లాలో చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. అక్రమ సంబంధం కారణంగా వివాహిత, ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన హాట్ టాపిక్ గా మారింది.
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. సిద్దిపేట జిల్లా కోహెడ మండలం తంగాళ్లపల్లి గ్రామానికి చెందిన శివ(27), శిరీష(25) దంపతులు.. హాయిగా ..ఉన్నంతలో సంసారం కొనసాగిస్తూ ఉండేవారు. అంతా బాగానే ఉంది అనే సమయానికి.. వీరి సంసారంలో ఇంటి పక్కనే ఉండే శ్రీకాంత్ అనే యువకుడు ఎంటర్ అయ్యాడు. ఈయన శిరీషకు వరుసకు అల్లుడు అవుతాడు. ఇంటి పక్కనే ఉండడంతో.. తరుచూ ఇంటికి వస్తూ పోతూండేవాడు. ఈ క్రమం లోనే వన్ ఫైన్ డే .. టైం చూసి మ్యాటర్ కానిచ్చేసారు. ఇంకేముంది ఇక అదే పనిగా సమయం దొరికినప్పుడల్లా..ఇద్దరు రాసలీలల్లో మునిగిపోయేవారు. కరమీనా వీరి మధ్య మధ్య అక్రమ సంబంధం బలంగా ఏర్పడింది.
శివ ఇంట్లో లేని సమయంలో శిరీష తన అల్లుడితో రాసలీలలు కొనసాగించేది. ఈ విషయం బయట పడటంతో ఇరు కుటుంబాల వారు శిరీష, శ్రీకాంత్‌ను అరిచారు..ఇలాంటి పనులు చేయకూడదు అని తిట్టారు. దీంతో కొన్ని రోజులు సైలంట్ గా ఉన్నా మళ్ళీ కధ ముందుకొచ్చింది. శ్రీకాంత్.. శిరీష తో అక్రమ సంబంధం కొనసాగించారు.
సోమవారం శివ పనిమీద బయటకు వెళ్ళడంతో.. శిరీష తన అల్లుడు శ్రీకాంత్ ను రహస్యంగా పిలిపించుకుని రాసలీలల్లో మునిగితేలారు. ఏదో చప్పుడు అవ్వడంతో నిద్రలేచిన శిరీష అత్తగారు కిటికీలో నుంచి చూసి షాకై..బుద్ధి చెప్పాలని తలుపు బయట గడియ పెట్టి చుట్టుపక్కల వారిని కేకేసింది. అందరు వస్తే పరువు పోతుందని భావించి గదిలోనే ఫ్యాన్‌కు ఉరేసుకున ఆత్మహత్య చేసుకున్నారు వాళ్లిద్దరు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు.