Moviesఅతిలోక సుందరి శ్రీదేవి ఆస్తి విలువ ఎన్ని కోట్లో తెలుసా.. అసలు...

అతిలోక సుందరి శ్రీదేవి ఆస్తి విలువ ఎన్ని కోట్లో తెలుసా.. అసలు ఊహించలేరు..??

అతిలోక సుందరి శ్రీదేవి.. ఈ పేరు గురించి ఎంత చెప్పిన తక్కువే. ఆమె అందంతో..నటనతో ఎంతోమంది ప్రేక్ష్కులను సొంతం చేసుకుంది. శ్రీదేవి తెలుగులో ఎలాంటి బ్లాక్ బస్టర్ సినిమాలో నటించిందో అందరికి తెలిసిందే. ఇక ఈ అందాల తార మన తెలుగులో దాదాపు స్టార్ హీరోస్ అందరితోను జతకట్టింది. ముఖ్యంగా చిరంజీవి-శ్రీదేవి జంట అదుర్స్ అనే చెప్పాలి. ఈ కాంబినేషం లో వచ్చిన అని సినిమాలు బాక్స్ ఆఫిస్ వద్ద సూపర్ డూపర్ హిట్ గా నిలిచాయి. ఇక ఆ తరువత హీరో శోభన్ బాబు-శ్రీదేవి జంట ప్రేక్షకూలను బాగా ఎంటర్ టైన్ చేసింది.

ఆమె బ్రతికి ఉండగానే కూతురిని హీరోయిన్ గా చూడాలని అనుకున్నారు కాని అది జరగలేదు. శ్రీదేవి వారసత్వాన్ని అందుకుని జాన్వి కపూర్ హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి.. దడక్ సినిమాతో జాన్వి మెప్పించిందనే చెప్పాలి. ఇక ఒక సినిమాతో యూత్ ను ఆకట్టుకున్న జాన్వి గ్లామర్ షోలో తల్లిని మించేలా కనిపిస్తుంది. నెలకో ఫోటో షూట్ తో జాన్వి అదరగొడుతుంది.

ఈమధ్య జాన్వి మరింత రెచ్చిపోతుందని చెప్పొచ్చు. ఇటీవల వచ్చిన వోగ్ మెగజైన్ ఫోటో షూట్ లో జాన్వి ఇంకాస్త హంగమా చేస్తుంది. సినిమాలో కన్నా ఫోటో షూట్స్ తో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తుంది జాన్వి. ప్రస్తుతం అమ్మడు సౌత్ సినిమాల మీద కూడా ఇంట్రెస్ట్ చూపిస్తుంది. చూస్తుంటే తల్లిని మించిన అందగత్తెగా ప్రేక్షకుల ఆమోదం పొందేందుకు ప్రయత్నాలు చేస్తుంది జాన్వి కపూర్.

శ్రీదేవి తర్వాత ఆమె ఫాలోయింగ్ ను తనకు ఏర్పరచుకోవాలని విశ్వప్రయత్నాలు చేస్తుంది జాన్వి. అందులో భాగంగానే ఫోటో షూట్స్ తో కుర్రాళ్లను పిచ్చివాళ్లను చేస్తుంది. బాలీవుడ్ లోనే కాదు తెలుగులో కూడా శ్రీదేవి చాలా సినిమాల్లో చేశారు. ఈ లెక్కన జాన్వి కూడా తెలుగు సినిమాల్లో నటించే అవకాశాలు ఉన్నాయి. ఇక తాజాగా శ్రీదేవికి సంబంధించిన ఆస్తి విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఒక ప్రముఖ మీడియా తెలిపిన ప్రకారం శ్రీదేవి చనిపోయే సమయంలో మొత్తం ఆస్తి 250 కోట్ల రూపాయలకు పైగా ఆస్తి ఉన్నట్లు సమాచారం. ఇక అంతే కాకుండా శ్రీదేవికి ఎన్నో ఖరీదైన కార్లు కూడా ఉండేవట. ఇక భర్త బోనీ కపూర్తో కలిసి వివిధ ప్రాంతాలలో వివిధ పెట్టుబడులు పెట్టారట. అయితే ఆమె మరణించడం వెనుక ఏదో రహస్యం ఉన్నట్లు అప్పట్లో ఊహాగానాలు వచ్చాయి. ఇక శ్రీదేవి మరణం ఇప్పటికూడా ఓ అంతుచిక్కని మిస్టరీగానే ఉంది.

 

 

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news