ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలో.. హీరోలు డైలాగులు చెప్పే ముందు ముందుగానే ప్రాక్టీస్ చేసుకొని షాట్ చేస్తూ ఉంటారు. కేవలం ఒక్క షాట్ లోనే అయిపోతుందా..? అంటే చెప్పలేము.ఒకవేళ సరిగ్గా కుదరకపోతే ఎన్నిసార్లైనా షాట్ ఓకే అయ్యేవరకు దర్శకులు, నటులతో చేయిస్తూనే ఉంటారు. అందుకే డైలాగులను కంఠస్థం చేసుకొని అయినా సరే హీరోలు ఒకే షాట్లో అయిపోవాలని ప్రయత్నిస్తూ ఉంటారు. కానీ ఇక్కడ ఒక స్టార్ హీరో మాత్రం సినిమా మొత్తానికి తనకిచ్చిన డైలాగ్స్ ను కేవలం దర్శకుడికి ఒకే షాట్లో వినిపించి ఆశ్చర్యపరిచాడట.
ఇంతకూ ఆయన ఎవరో కాదు.. ఆంధ్రులు అన్న అని ముద్దుగా పిలుచుకునే వ్యక్తి నందమూరి తారక రామారావు. ఎన్టీఆర్ మొదట కేవలం తన సినిమాలన్నీ విజయ ప్రొడక్షన్స్ బ్యానర్ లో మాత్రమే నిర్మిస్తానని అగ్రిమెంట్ చేసుకోవడం జరిగింది. తర్వాత మొదటిసారిగా ఇతర నిర్మాతలతో కలిసి తీసిన చిత్రం వద్దంటే డబ్బు. ఇక ఈ సినిమా దర్శకుడు తెలుగు సినిమా పితామహుడిగా, పప్పాజీ గా పేరు పొందిన హెచ్.ఎం.రెడ్డి . ఇక స్వామీజీ గా గుర్తింపు పొందిన ఆయన కుమారుడు వై ఆర్ స్వామి. ఈ చిత్రానికి డైలాగులు సదాశివబ్రహ్మం అనే రచయిత రాశాడు.
డైలాగులు అలాగే స్క్రిప్ట్ తో తయారైన ఒక ఫైల్ పప్పాజీ , ఎన్టీఆర్‌కు ఇచ్చారట. ఒకసారి చదివిన తర్వాత ఎన్టీఆర్ అప్పాజీ తో ఇలా అన్నారట.. మీరు కొద్దిసేపు ఉంటానంటే నేను డైలాగులు అన్నీ చెప్పేస్తాను.. ఒకవేళ మీరు మార్చాలనుకుంటే మార్చేయండి అని అన్నారట. అప్పుడు పప్పాజీ కూడా ఓకే చెప్పాడు. ఆ సినిమాలో తనకున్న డైలాగులని కేవలం ఒకే షాట్లో చెప్పడంతో పప్పాజి అక్కడికక్కడే ఆశ్చర్యపోయాడు. అంతేకాదు ఈయన అమోఘమైన మేధస్సును అప్పాజీ వేన్నోళ్ల కీర్తించేవారు. ఈ సినిమా షూటింగ్ సాయంత్రం 6 గంటల నుండి రాత్రి రెండు గంటల వరకు కొనసాగేది. ఈ సినిమా విడుదలయ్యాక సూపర్ డూపర్ హిట్ అయ్యింది.